బావంటాఁ జూడ వచ్చిన ఫల మాకెకుఁ గలిగె
(॥పల్లవి॥)
బావంటాఁ జూడ వచ్చిన ఫల మాకెకుఁ గలిగె
యీవలఁ జెలికత్తెల మే మనేము నిన్నును
(॥బావ॥)
తొడల సందికిఁ దీసి తొయ్యలిఁ బెనచుకొని
జడియఁ బయ్యదకొంగు జారఁ దీసి
వొడిసి కుచగిరుల నురమున నప్పళించి
కడు నలయించితివి కటకటా చెలిని
(॥బావ॥)
కుమ్ముడి వట్టి వెనకకూను వంచి మొగమెత్తి
చిమ్ముచును నొకచేతఁ జెక్కు నొక్కి
తమ్ములము నోరిలోన తమకముతోఁ బెట్టి
చిమ్మి రేఁచితి వింతేసి చెల్లఁబో చెలిని
(॥బావ॥)
వువిద కాఁగిట నించి వొత్తికిల పానుపుపై
జవళిఁ గూడితివి పచ్చడము గప్పి
యివల శ్రీవెంకటేశ యీకె యలమేలుమంగ
తవిలి పెండ్లాడితివి తగునయ్యా చెలిని
(||pallavi||)
bāvaṁṭām̐ jūḍa vachchina phala māgĕgum̐ galigĕ
yīvalam̐ jĕligattĕla me manemu ninnunu
(||bāva||)
tŏḍala saṁdigim̐ dīsi tŏyyalim̐ bĕnasugŏni
jaḍiyam̐ bayyadagŏṁgu jāram̐ dīsi
vŏḍisi kusagirula nuramuna nappaḽiṁchi
kaḍu nalayiṁchidivi kaḍagaḍā sĕlini
(||bāva||)
kummuḍi vaṭṭi vĕnagagūnu vaṁchi mŏgamĕtti
simmusunu nŏgasedam̐ jĕkku nŏkki
tammulamu norilona tamagamudom̐ bĕṭṭi
simmi rem̐sidi viṁtesi sĕllam̐bo sĕlini
(||bāva||)
vuvida kām̐giḍa niṁchi vŏttigila pānububai
javaḽim̐ gūḍidivi pachchaḍamu gappi
yivala śhrīvĕṁkaḍeśha yīgĕ yalamelumaṁga
tavili pĕṁḍlāḍidivi tagunayyā sĕlini