Baasa ichchinavaamdavai paragidenemi naagu

బాస ఇచ్చినవాఁడవై పరగితేనేమి నాకు
Language

(॥పల్లవి॥)
బాస ఇచ్చినవాఁడవై పరగితేనేమి నాకు
ఆసపడ్డదానిఁ గొంత యాదరించరాదా

(॥బాస॥)
పెనఁగి పెనఁగి నీకు ప్రియము చెప్పె నిందాఁక
ననిచి యాపెతోఁ గొంత నవ్వరాదా
వినయముతో నిన్ను వేఁడుకొనె నప్పటిని
చనవిచ్చి ఇఁక సరసము లాడరాదా

(॥బాస॥)
మొక్కు మొక్కి తేరకొన మోము చూచీ నేఁకటతో
మక్కువతో నిచ్చగించి మాటాడరాదా
చక్కఁగా నీకూడిగాలు సారె సారెఁ జేసీని
అక్కరతోఁ బాదాలొత్త నప్పణియ్య రాదా

(॥బాస॥)
కాఁపురాలు సేసేనంటా కాచుకవున్నది తాను
ఆప్రక నీచెలి చన్ను లంటఁగరాదా
చేపట్టి నన్నేలితివి శ్రీవేంకటేశ్వర
యేపునఁ దనవలపు లియ్యకొనరాదా

(||pallavi||)
bāsa ichchinavām̐ḍavai paragidenemi nāgu
āsabaḍḍadānim̐ gŏṁta yādariṁcharādā

(||bāsa||)
pĕnam̐gi pĕnam̐gi nīgu priyamu sĕppĕ niṁdām̐ka
nanisi yābĕdom̐ gŏṁta navvarādā
vinayamudo ninnu vem̐ḍugŏnĕ nappaḍini
sanavichchi im̐ka sarasamu lāḍarādā

(||bāsa||)
mŏkku mŏkki teragŏna momu sūsī nem̐kaḍado
makkuvado nichchagiṁchi māḍāḍarādā
sakkam̐gā nīgūḍigālu sārĕ sārĕm̐ jesīni
akkaradom̐ bādālŏtta nappaṇiyya rādā

(||bāsa||)
kām̐purālu sesenaṁṭā kāsugavunnadi tānu
āpraga nīsĕli sannu laṁṭam̐garādā
sebaṭṭi nannelidivi śhrīveṁkaḍeśhvara
yebunam̐ danavalabu liyyagŏnarādā