Baalulado veedhulalom baaraaduvaamdu

బాలులతో వీధులలోఁ బారాడువాఁడు
Language

(॥పల్లవి॥)
బాలులతో వీధులలోఁ బారాడువాఁడు
కోలలెత్తుక వుట్లు గొట్టీఁ జుండీ

(॥బాలు॥)
నారికడపువక్కలు నానిన సనగలు
చారపప్పుఁ దేనెలు చక్కెరలును
పేరిననేతులు నానబియ్యాలు నుట్ల నవే
చేరి యశోదబిడ్డకు జెప్పేరు సుండీ

(॥బాలు॥)
చక్కిలాలు నడుకులు సనిగెపప్పులును
చెక్కిన మెత్తనితూఁట చెఱకులును
పెక్కువగా నుట్లలో బిందెల నించిన వవే
చక్కనెశోదబిడ్డకుఁ జాటేరు సుండీ

(॥బాలు॥)
నవ్వులుఁ జిటిబెల్లాలు నున్ననిచిమ్మిలులు
నవ్వుటిడియునుఁ జిన్ని నురుగులును
యెవ్వారు వేంకటపతి కెఱుగించ నారగించి
కివ్వకివ్వ నవ్వ నణఁకించీ జుండీ

(||pallavi||)
bālulado vīdhulalom̐ bārāḍuvām̐ḍu
kolalĕttuga vuṭlu gŏṭṭīm̐ juṁḍī

(||bālu||)
nārigaḍabuvakkalu nānina sanagalu
sārabappum̐ denĕlu sakkĕralunu
perinanedulu nānabiyyālu nuṭla nave
seri yaśhodabiḍḍagu jĕpperu suṁḍī

(||bālu||)
sakkilālu naḍugulu sanigĕbappulunu
sĕkkina mĕttanidūm̐ṭa sĕṟagulunu
pĕkkuvagā nuṭlalo biṁdĕla niṁchina vave
sakkanĕśhodabiḍḍagum̐ jāḍeru suṁḍī

(||bālu||)
navvulum̐ jiḍibĕllālu nunnanisimmilulu
navvuḍiḍiyunum̐ jinni nurugulunu
yĕvvāru veṁkaḍabadi kĕṟugiṁcha nāragiṁchi
kivvagivva navva naṇam̐kiṁchī juṁḍī