Baalagi gaani yimti praudhagaadu aage

బాలకి గాని యింతి ప్రౌఢగాదు ఆకె
Language

(॥పల్లవి॥)
బాలకి గాని యింతి ప్రౌఢగాదు ఆకె-
చేల కొంగంటుచును మచ్చిక సేయవయ్యా

(॥బాల॥)
నీవు వచ్చేదెఱఁగక నెలఁత నిన్నుఁ దాడి
చేవల్ల నిన్నటుచూచి సిగ్గువడెను
యీవల నాసిగ్గుదేర ఇంతితోడ సుతి గూడి
తోవ చూపి చూపి ఇట్టె తోడు వాడవయ్యా

(॥బాల॥)
నాటకసాల లోన నాతి యాడి నిన్నుఁగని
చీటికిమాటి నిట్టే సిగ్గువడెను
నీటున నాసిగ్గుదేర నీవు కోపులెత్తియెత్తి
తూఁటరితనముతోడ తోడాడవయ్యా

(॥బాల॥)
కాఁగిటికిఁ జేయి చాఁచి గక్కున నీమోము చూచి
చేఁగలనవ్వులు నవ్వి సిగ్గువడెను
యీగతి శ్రీవేంకటేశ యింతిసిగ్గుదేరఁ గూడి
కాఁగిటనే నించి నించి కళదాఁకించవయ్యా

(||pallavi||)
bālagi gāni yiṁti prauḍhagādu āgĕ-
sela kŏṁgaṁṭusunu machchiga seyavayyā

(||bāla||)
nīvu vachchedĕṟam̐gaga nĕlam̐ta ninnum̐ dāḍi
sevalla ninnaḍusūsi sigguvaḍĕnu
yīvala nāsiggudera iṁtidoḍa sudi gūḍi
tova sūbi sūbi iṭṭĕ toḍu vāḍavayyā

(||bāla||)
nāḍagasāla lona nādi yāḍi ninnum̐gani
sīḍigimāḍi niṭṭe sigguvaḍĕnu
nīḍuna nāsiggudera nīvu kobulĕttiyĕtti
tūm̐ṭaridanamudoḍa toḍāḍavayyā

(||bāla||)
kām̐giḍigim̐ jeyi sām̐si gakkuna nīmomu sūsi
sem̐galanavvulu navvi sigguvaḍĕnu
yīgadi śhrīveṁkaḍeśha yiṁtisigguderam̐ gūḍi
kām̐giḍane niṁchi niṁchi kaḽadām̐kiṁchavayyā