Baalabommasaarivi pattabuvigaarivi

బాలబొమ్మచారివి పట్టపువికారివి
Language

(॥పల్లవి॥)
బాలబొమ్మచారివి పట్టపువికారివి
ఓలి నీ వెవ్వరిఁ గన్నా నూరకుండేవా

(॥దొంగి॥)
దొంగిలి వెన్నలుఁ బాలు దొడికేటినీచేయి
ముంగిట నిధానమున్న మోసపోయీనా
చెంగట నిన్నెవ్వరైనాఁ జెనకి నవ్విననూ
అంగవించి కొనగోర నంటకుండేవా

(॥దొంగి॥)
సిగ్గరి గొల్లెతలపైఁ జిమ్మెడి నీ చూపు
బగ్గన నిచ్చన చోటఁ బారవేసేవా
దగ్గరి నిన్నెవ్వరైనాఁ దగులనాడిననూ
ఎగ్గెఱుఁగ కెందుకైనా నేఁగకుండేవా

(॥దొంగి॥)
కొమ్మల చీరలు దీసుకొని యున్న నీవూ
దిమ్మరి చేఁతల నిట్టె దిగఁ దోసేవా
క్రమ్మర నావలెనె వేంకటగిరి విభుండా
బిమ్మిటిగాఁ గూడి ప్రేమ పెంచకుండేవా

(||pallavi||)
bālabŏmmasārivi paṭṭabuvigārivi
oli nī vĕvvarim̐ gannā nūraguṁḍevā

(||dŏṁgi||)
dŏṁgili vĕnnalum̐ bālu dŏḍigeḍinīseyi
muṁgiḍa nidhānamunna mosaboyīnā
sĕṁgaḍa ninnĕvvarainām̐ jĕnagi navvinanū
aṁgaviṁchi kŏnagora naṁṭaguṁḍevā

(||dŏṁgi||)
siggari gŏllĕdalabaim̐ jimmĕḍi nī sūbu
baggana nichchana soḍam̐ bāravesevā
daggari ninnĕvvarainām̐ dagulanāḍinanū
ĕggĕṟum̐ga kĕṁdugainā nem̐gaguṁḍevā

(||dŏṁgi||)
kŏmmala sīralu dīsugŏni yunna nīvū
dimmari sem̐tala niṭṭĕ digam̐ dosevā
krammara nāvalĕnĕ veṁkaḍagiri vibhuṁḍā
bimmiḍigām̐ gūḍi prema pĕṁchaguṁḍevā