బాపురే యింత గాకుంటె భ్రమతురా గొల్లెతలు
(॥పల్లవి॥)
బాపురే యింత గాకుంటె భ్రమతురా గొల్లెతలు
యేపున జాణతనాలు యింతేసి నేర్చితివి
(॥॥)
ప్రియురాలనై నీకు పెక్కుసేవలు సేయఁగా
నయగారిమాటలాడి నవ్వించేవు
బయకారివాఁడవని పడఁతులచే వింటి
నియతితో సరివచ్చె నీగుణములెల్లను
(॥॥)
అచ్చలాన నే నీకు నాలనై వుండఁ గాను
యిచ్చకములెల్లాఁ జేసి యెలయించేవు
తచ్చనకాఁడవని తగుల నిన్నాడుదురు
వచ్చెఁ దారుకాణలు వరుస నీసుద్దులు
(॥॥)
యేకతాన నే నిన్ను యెలమిఁ గూడుండఁ గాను
కాకరితనాలఁ దమి కడురేఁచేవు
మేకులవాఁడవని మెత్తురు శ్రీ వేంకటేశ
జోకలతో నీడువచ్చె సొరిది నీకతలు
(||pallavi||)
bābure yiṁta gāguṁṭĕ bhramadurā gŏllĕdalu
yebuna jāṇadanālu yiṁtesi nersidivi
(||||)
priyurālanai nīgu pĕkkusevalu seyam̐gā
nayagārimāḍalāḍi navviṁchevu
bayagārivām̐ḍavani paḍam̐tulase viṁṭi
niyadido sarivachchĕ nīguṇamulĕllanu
(||||)
achchalāna ne nīgu nālanai vuṁḍam̐ gānu
yichchagamulĕllām̐ jesi yĕlayiṁchevu
tachchanagām̐ḍavani tagula ninnāḍuduru
vachchĕm̐ dārugāṇalu varusa nīsuddulu
(||||)
yegadāna ne ninnu yĕlamim̐ gūḍuṁḍam̐ gānu
kāgaridanālam̐ dami kaḍurem̐sevu
megulavām̐ḍavani mĕtturu śhrī veṁkaḍeśha
jogalado nīḍuvachchĕ sŏridi nīgadalu