Baabure yemtadi jaana baalakrshnumdu soodam

బాపురే యెంతటి జాణ బాలకృష్ణుఁడు చూడఁ
Language

(॥పల్లవి॥)
బాపురే యెంతటి జాణ బాలకృష్ణుఁడు చూడఁ
బాపనివలె నున్నాఁడు బలరామకృష్ణుఁడు

(॥బాపరే॥)
వొంటి గోపికలచన్ను లుట్లపై కుండ లంటా
అంటుచుఁ జేతులు చాఁచీ నదే కృష్ణుఁడు
వెంటనే ఆధరములు వెస మోవిపండ్లంటా
గొంటరియై అడిగీని గోవిందకృష్ణుఁడు

(॥బాపరే॥)
సతుల పెద్ద కొప్పులు చక్కిలాలగంప లంటా
బతిమాలి వేఁడీ నప్పటిఁ గృష్ణుఁడు
చతురతఁ బిరుఁదులు చక్కెరదీబ లంటా
తతిగొని యంటీని దామోదరకృష్ణుఁడు

(॥బాపరే॥)
అంగనలవొడికట్లు అరఁటిపండ్లంటా
సంగతిఁ గౌఁగిలించీ వేసాలకృష్ణుఁడు
అంగడి నింతులెల్లాను అలమేలుమంగ యంటా
చెంగలించి కూడీని శ్రీవేంకటకృష్ణుఁడు

(||pallavi||)
bābure yĕṁtaḍi jāṇa bālakṛṣhṇum̐ḍu sūḍam̐
bābanivalĕ nunnām̐ḍu balarāmakṛṣhṇum̐ḍu

(||bābare||)
vŏṁṭi gobigalasannu luṭlabai kuṁḍa laṁṭā
aṁṭusum̐ jedulu sām̐sī nade kṛṣhṇum̐ḍu
vĕṁṭane ādharamulu vĕsa movibaṁḍlaṁṭā
gŏṁṭariyai aḍigīni goviṁdakṛṣhṇum̐ḍu

(||bābare||)
sadula pĕdda kŏppulu sakkilālagaṁpa laṁṭā
badimāli vem̐ḍī nappaḍim̐ gṛṣhṇum̐ḍu
saduradam̐ birum̐dulu sakkĕradība laṁṭā
tadigŏni yaṁṭīni dāmodarakṛṣhṇum̐ḍu

(||bābare||)
aṁganalavŏḍigaṭlu aram̐ṭibaṁḍlaṁṭā
saṁgadim̐ gaum̐giliṁchī vesālakṛṣhṇum̐ḍu
aṁgaḍi niṁtulĕllānu alamelumaṁga yaṁṭā
sĕṁgaliṁchi kūḍīni śhrīveṁkaḍakṛṣhṇum̐ḍu