బాపురే వో ప్రాణి బాపురే వో మనసా
(॥పల్లవి॥)
బాపురే వో ప్రాణి బాపురే వో మనసా
వో పనస వెందుకైనా నొడఁబడేవు
(॥బాపు॥)
మురికి దేహమొకటి మోచుక నీ వప్పటిని
మురికి దేహసతుల మోవఁగోరే వప్పటిని
కరకు హేయము గొంత కడుపున నించుకొని
తిరిగి హేయమేకాను(?) తినఁబోయే వప్పటి
(॥బాపు॥)
పసిఁడి కమ్ముడువోయి పరులఁగొలిచి మరిఁ
బసిఁడి సొమ్మంటాఁ బైఁ బెట్టఁ గోరేవు
పిసరుఁ బాపపుణ్యాలఁ బెడఁగేలు గట్టించుక
విసువక అవియే కావించఁబోయే వప్పటి
(॥బాపు॥)
పంచభూతములచేతఁ బట్టువడి కమ్మరాను
పంచభూతాల దేహుల బంధులంటాఁ దగిలేవు
అంచెల శ్రీవేంకటేశుఁ డాతుమలో నున్నవాఁడు
యెంచుక తెలిసియును ఇట్టె మరచే వప్పటి
(||pallavi||)
bābure vo prāṇi bābure vo manasā
vo panasa vĕṁdugainā nŏḍam̐baḍevu
(||bābu||)
murigi dehamŏgaḍi mosuga nī vappaḍini
murigi dehasadula movam̐gore vappaḍini
karagu heyamu gŏṁta kaḍubuna niṁchugŏni
tirigi heyamegānu(?) tinam̐boye vappaḍi
(||bābu||)
pasim̐ḍi kammuḍuvoyi parulam̐gŏlisi marim̐
basim̐ḍi sŏmmaṁṭām̐ baim̐ bĕṭṭam̐ gorevu
pisarum̐ bābabuṇyālam̐ bĕḍam̐gelu gaṭṭiṁchuga
visuvaga aviye kāviṁcham̐boye vappaḍi
(||bābu||)
paṁchabhūdamulasedam̐ baṭṭuvaḍi kammarānu
paṁchabhūdāla dehula baṁdhulaṁṭām̐ dagilevu
aṁchĕla śhrīveṁkaḍeśhum̐ ḍādumalo nunnavām̐ḍu
yĕṁchuga tĕlisiyunu iṭṭĕ marase vappaḍi