బాపు బాపు నేఁ జేసిన భాగ్య మెట్టిదో
(॥పల్లవి॥)
బాపు బాపు నేఁ జేసిన భాగ్య మెట్టిదో
తాపికత్తెఁ జేసి నన్ను దయఁ జూచితివిగా
(॥బాపు॥)
మనసొక్కటాయ నేఁడు మగువా నీవును రాఁగా
యెనసి వుండిన పొందు కిది గురుతు
ననిచిన వారము నాకు నీకుఁ బోవునా
ఘనమై యెక్కుడు వస్తే కైకొందువుగాక
(॥బాపు॥)
నమ్మితి నీమాఁటలెల్లా నాయింట నీపెఁ బెట్టఁగా
యిమ్ములఁ గొంకుదేరుట కిది గురుతు
సమ్మతైన మనలోన సరవులు దప్పీనా
వుమ్మడివారు వచ్చితే వూరడింతుగాక
(॥బాపు॥)
యెక్కువ భూసతిఁ గూడి యిటు నన్ను మన్నించితి
విక్కడ శ్రీ సతి వౌట కిది గురుతు
దక్కితి శ్రీ వేంకటేశ తప్పులు మనకు లేవు
మిక్కటపు యీపెరతి మెత్తువు గాక
(||pallavi||)
bābu bābu nem̐ jesina bhāgya mĕṭṭido
tābigattĕm̐ jesi nannu dayam̐ jūsidivigā
(||bābu||)
manasŏkkaḍāya nem̐ḍu maguvā nīvunu rām̐gā
yĕnasi vuṁḍina pŏṁdu kidi gurudu
nanisina vāramu nāgu nīgum̐ bovunā
ghanamai yĕkkuḍu vaste kaigŏṁduvugāga
(||bābu||)
nammidi nīmām̐ṭalĕllā nāyiṁṭa nībĕm̐ bĕṭṭam̐gā
yimmulam̐ gŏṁkuderuḍa kidi gurudu
sammadaina manalona saravulu dappīnā
vummaḍivāru vachchide vūraḍiṁtugāga
(||bābu||)
yĕkkuva bhūsadim̐ gūḍi yiḍu nannu manniṁchidi
vikkaḍa śhrī sadi vauḍa kidi gurudu
dakkidi śhrī veṁkaḍeśha tappulu managu levu
mikkaḍabu yībĕradi mĕttuvu gāga