Baabu baabu neevimta panivaamda vaidigaa

బాపు బాపు నీవింత పనివాఁడ వైతిగా
Language

(॥పల్లవి॥)
బాపు బాపు నీవింత పనివాఁడ వైతిగా
తీపుల నాఁటదానిచే తీరుకు వచ్చితివి

(॥బాప॥)
కందువ నీచేతు లెల్లా గట్టులై వున్నవి వే
గందము దీసిత్తు వా కాంతకు నీవు
అందమై వాచకపుమాట లాడేవు సారె నాపె
పొందులఁ జదివించునా పాస్తకములు నిన్ను

(॥బాప॥)
యేకడనుఁ జూచినాను యెఱ్ఱనాయ నీ గోళ్ళు
ఆకు మడిచి యిత్తువా ఆమెకు నీవు
చేకొని నీ తురుమెల్లా చెదరి వున్నది నేఁడు
పోకుమని నీ నెత్తి పూవులు మోపించెనా

(॥బాప॥)
ఆనుకొని నీపచ్చడ మదే పసపై వున్నది
పానుపుగా బరతువా పడఁతికిని
మోనాన శ్రీవేంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
కానిమ్మని వలపులు కలయఁ బెట్టించెనా

(||pallavi||)
bābu bābu nīviṁta panivām̐ḍa vaidigā
tībula nām̐ṭadānise tīrugu vachchidivi

(||bāba||)
kaṁduva nīsedu lĕllā gaṭṭulai vunnavi ve
gaṁdamu dīsittu vā kāṁtagu nīvu
aṁdamai vāsagabumāḍa lāḍevu sārĕ nābĕ
pŏṁdulam̐ jadiviṁchunā pāstagamulu ninnu

(||bāba||)
yegaḍanum̐ jūsinānu yĕṭranāya nī goḽḽu
āgu maḍisi yittuvā āmĕgu nīvu
segŏni nī turumĕllā sĕdari vunnadi nem̐ḍu
pogumani nī nĕtti pūvulu mobiṁchĕnā

(||bāba||)
ānugŏni nībachchaḍa made pasabai vunnadi
pānubugā baraduvā paḍam̐tigini
monāna śhrīveṁkaḍeśha muṁchi nannum̐ gūḍidivi
kānimmani valabulu kalayam̐ bĕṭṭiṁchĕnā