Baabu baabu neemelu pakkana nannamtugone

బాపు బాపు నీమేలు పక్కన నన్నంటుకొనె
Language

(॥పల్లవి॥)
బాపు బాపు నీమేలు పక్కన నన్నంటుకొనె
కైపగు పుణుఁగు పువ్వు గట్టినట్టే ఆయను

(॥బాపు॥)
పనిలేని పనికైనఁ బదరి కోపగింతు
వెనకనే నీవు నన్ను వేడుకొందువు
తలవోని నీమంచితనమె నావీరిడి-
తనమెల్లఁ బాపి లోలో తమి నాకు రేఁచెను

(॥బాపు॥)
యెప్పుడు నే నాడేవి యీసడపు పలుకులే
కప్పురపు నవ్వు నీవే కలపుదువు
యిప్పటి నానేరమికే యింతేసి నీ నేరుపులు
చొప్పు మాపి నిన్ను నన్ను చుట్టాలఁగా జేసెను

(॥బాపు॥)
చీటికి మాటికి నీతో సిగ్గులు నేఁ బచరింతు
కూటపుఁ గాఁగిట నీవే కూడుదువు
యీటున శ్రీవేంకటేశ యిప్పటి నీరతులే
వోటమి దీర నన్ను నీ పుర మెక్కఁజేసెను

(||pallavi||)
bābu bābu nīmelu pakkana nannaṁṭugŏnĕ
kaibagu puṇum̐gu puvvu gaṭṭinaṭṭe āyanu

(||bābu||)
panileni panigainam̐ badari kobagiṁtu
vĕnagane nīvu nannu veḍugŏṁduvu
talavoni nīmaṁchidanamĕ nāvīriḍi-
tanamĕllam̐ bābi lolo tami nāgu rem̐sĕnu

(||bābu||)
yĕppuḍu ne nāḍevi yīsaḍabu palugule
kappurabu navvu nīve kalabuduvu
yippaḍi nāneramige yiṁtesi nī nerubulu
sŏppu mābi ninnu nannu suṭṭālam̐gā jesĕnu

(||bābu||)
sīḍigi māḍigi nīdo siggulu nem̐ basariṁtu
kūḍabum̐ gām̐giḍa nīve kūḍuduvu
yīḍuna śhrīveṁkaḍeśha yippaḍi nīradule
voḍami dīra nannu nī pura mĕkkam̐jesĕnu