Baabu baabu melu voṟabarivauduvu

బాపు బాపు మేలు వొఱపరివౌదువు
Language

(॥పల్లవి॥)
బాపు బాపు మేలు వొఱపరివౌదువు
చాపలాన నీవే కడు జాణవు గావోయీ

(॥బాప॥)
మొగమీకె చూడఁగానే మొనసి వేరొకతెతో
నగవులు నవ్వేవు నాలికాఁడవు
తగులఁగానే మరి తరితీపు వుట్టించేవు
జగములోపల నీవే జాణవు గావోయీ

(॥బాప॥)
మాటలీకె ఆడఁగానే మగిడి పొరుగాకెను
నీటుతోడఁ బిలిచేవు నేరుపరివి
గాటాన వలచుండఁగ కాఁకలు గడు రేఁచేవు
చాటువగా నీవే కడు జాణవు గావోయీ

(॥బాప॥)
చేరి యీకెఁ గూడఁగానే చెలిపైఁ జేయి వేసి
గారవించేవు శ్రీవేంకటేశుఁడవు
యీరీతి నన్నేలి యాపె యెదనుండఁ జొక్కించేవు
సారెసారెకును నీవే జాణవు గావోయీ

(||pallavi||)
bābu bābu melu vŏṟabarivauduvu
sābalāna nīve kaḍu jāṇavu gāvoyī

(||bāba||)
mŏgamīgĕ sūḍam̐gāne mŏnasi verŏgadĕdo
nagavulu navvevu nāligām̐ḍavu
tagulam̐gāne mari taridību vuṭṭiṁchevu
jagamulobala nīve jāṇavu gāvoyī

(||bāba||)
māḍalīgĕ āḍam̐gāne magiḍi pŏrugāgĕnu
nīḍudoḍam̐ bilisevu nerubarivi
gāḍāna valasuṁḍam̐ga kām̐kalu gaḍu rem̐sevu
sāḍuvagā nīve kaḍu jāṇavu gāvoyī

(||bāba||)
seri yīgĕm̐ gūḍam̐gāne sĕlibaim̐ jeyi vesi
gāraviṁchevu śhrīveṁkaḍeśhum̐ḍavu
yīrīdi nanneli yābĕ yĕdanuṁḍam̐ jŏkkiṁchevu
sārĕsārĕgunu nīve jāṇavu gāvoyī