బాపు బాపు మెచ్చితిని పదవే నీవు
(॥పల్లవి॥)
బాపు బాపు మెచ్చితిని పదవే నీవు
తీపులోనఁ జేఁదేల తెగకువే నీవు
(॥॥)
సెలవి నే నవ్వుటేడ చేరి నీ గొఱఁగు లేడ
మెలఁకువ లెస్సాయ మేలే నీవు
అలిగినదే లేదు అంతక తొల్లే మనము
పిలిచితే బిగిసేది పెద్దరికమటవే
(॥॥)
పోందినేఁ జేయివేయుటెంత బొమ్మల నీజంకె నెంత
అందు కందుకు లెస్సాయ నౌనే నీవు
కందువై నమనలోనఁ గవట మించుక లేదు
యిందరుఁ జూడఁగఁ గోప మేడనుండి వచ్చెనే
(॥॥)
కాఁగిట నేఁ గూడుటెట్టు కరఁగే వింతలో నెట్టు
రాఁగె నిదివో వలపు రావే నీవు
చేఁగదేరఁ గూడితిని శ్రీ వేంకటేశుఁడ నేను
అఁగినరతుల నింత అలయఁగఁదగునా
(||pallavi||)
bābu bābu mĕchchidini padave nīvu
tībulonam̐ jem̐dela tĕgaguve nīvu
(||||)
sĕlavi ne navvuḍeḍa seri nī gŏṟam̐gu leḍa
mĕlam̐kuva lĕssāya mele nīvu
aliginade ledu aṁtaga tŏlle manamu
piliside bigisedi pĕddarigamaḍave
(||||)
poṁdinem̐ jeyiveyuḍĕṁta bŏmmala nījaṁkĕ nĕṁta
aṁdu kaṁdugu lĕssāya naune nīvu
kaṁduvai namanalonam̐ gavaḍa miṁchuga ledu
yiṁdarum̐ jūḍam̐gam̐ goba meḍanuṁḍi vachchĕne
(||||)
kām̐giḍa nem̐ gūḍuḍĕṭṭu karam̐ge viṁtalo nĕṭṭu
rām̐gĕ nidivo valabu rāve nīvu
sem̐gaderam̐ gūḍidini śhrī veṁkaḍeśhum̐ḍa nenu
am̐ginaradula niṁta alayam̐gam̐dagunā