Baabu baabu mechchidimi baalasiddhumdaa

బాపు బాపు మెచ్చితిమి బాలసిద్ధుఁడా
Language

(॥పల్లవి॥)
బాపు బాపు మెచ్చితిమి బాలసిద్ధుఁడా
రాపుల సింగారపు రససిద్ధుఁడా

(॥బాపు॥)
నీరధిలో విహరించు నిజసిద్ధుఁడా
తారి తారి మెలఁగే పాతాళసిద్ధుఁడా
భారపు భూమి మోచేటి బలుసిద్ధుఁడా
తోరపు కంబము మీఁది దొడ్డసిద్ధుఁడా

(॥బాపు॥)
మింటిపొడవై నట్టి మేటి సిద్ధుఁడా
గెంటినతల్లి బదికించు సిద్ధుఁడా
పెంటిరాకాసిఁ జంపిన పెనుసిద్ధుఁడా
దంటభూతమునెత్తురు దాగితి సిద్ధుఁడా

(॥బాపు॥)
మచ్చి వూళ్లు చెరిచిన మాయసిద్ధుఁడా
రచ్చలోని ఱాతిగుఱ్ఱపు సిద్ధుఁడా
కొచ్చన శ్రీవేంకటాద్రిగుహ సిద్దుఁడా
అచ్చపు లోకము లేలే ఆది సిద్దుఁడా

(||pallavi||)
bābu bābu mĕchchidimi bālasiddhum̐ḍā
rābula siṁgārabu rasasiddhum̐ḍā

(||bābu||)
nīradhilo vihariṁchu nijasiddhum̐ḍā
tāri tāri mĕlam̐ge pādāḽasiddhum̐ḍā
bhārabu bhūmi moseḍi balusiddhum̐ḍā
torabu kaṁbamu mīm̐di dŏḍḍasiddhum̐ḍā

(||bābu||)
miṁṭibŏḍavai naṭṭi meḍi siddhum̐ḍā
gĕṁṭinadalli badigiṁchu siddhum̐ḍā
pĕṁṭirāgāsim̐ jaṁpina pĕnusiddhum̐ḍā
daṁṭabhūdamunĕtturu dāgidi siddhum̐ḍā

(||bābu||)
machchi vūḽlu sĕrisina māyasiddhum̐ḍā
rachchaloni ṟādiguṭrabu siddhum̐ḍā
kŏchchana śhrīveṁkaḍādriguha siddum̐ḍā
achchabu logamu lele ādi siddum̐ḍā