బాపు బాపు దేవుఁడా పంతపు వో మనసా
(॥పల్లవి॥)
బాపు బాపు దేవుఁడా పంతపు వో మనసా
వోపెఁ గా యిందుకు జీవుఁ డోహో నామాయ
(॥బాపు॥)
నిన్నటిదినము నేఁడు నిజమో కల్లో
కన్నులఁ గన్నట్లాయఁ గానఁగరాదు
యెన్నఁగ రేపటిదిన మేమో యెట్లో
వున్నట్టు దెలియఁగరాదు వోహో నీమాయ
(॥బాపు॥)
బాలఁనాటి పుట్టుగిది భ్రమయో నిజమో
గాలినె కాలముఁ బోయ కతలాయను
యీలీల మీఁదిమరణ మేమో యెట్టో
వోలిఁ దెలియఁగరాదు వోహో నీమాయ
(॥బాపు॥)
నెక్కుఁ మింగినకడి నిజమో కల్లో
గక్కున రుచియుఁ దోచె కానఁగరాదు
యెక్కువ శ్రీ వేంకటేశ యిన్నియు నీదాసుఁడైతే
వొక్కటఁ గానఁగవచ్చు నోహో నీమాయ
(||pallavi||)
bābu bābu devum̐ḍā paṁtabu vo manasā
vobĕm̐ gā yiṁdugu jīvum̐ ḍoho nāmāya
(||bābu||)
ninnaḍidinamu nem̐ḍu nijamo kallo
kannulam̐ gannaṭlāyam̐ gānam̐garādu
yĕnnam̐ga rebaḍidina memo yĕṭlo
vunnaṭṭu dĕliyam̐garādu voho nīmāya
(||bābu||)
bālam̐nāḍi puṭṭugidi bhramayo nijamo
gālinĕ kālamum̐ boya kadalāyanu
yīlīla mīm̐dimaraṇa memo yĕṭṭo
volim̐ dĕliyam̐garādu voho nīmāya
(||bābu||)
nĕkkum̐ miṁginagaḍi nijamo kallo
gakkuna rusiyum̐ dosĕ kānam̐garādu
yĕkkuva śhrī veṁkaḍeśha yinniyu nīdāsum̐ḍaide
vŏkkaḍam̐ gānam̐gavachchu noho nīmāya