అయ్యో యిప్పుడిచ్చకము లాడేవు గాక
(॥పల్లవి॥)
అయ్యో యిప్పుడిచ్చకము లాడేవు గాక
గయ్యాళిచేఁతలఁ గాక కైవశ మయ్యేవా
(॥అయ్యో॥)
కన్నుల జంకించక కరఁగునా నీమనసు
సన్నలు శాయక యాసలు రేఁగునా
వున్నతి నిన్నుఁగొసర కూరకే లోనయ్యేవా
యెన్నఁగ నే గబ్బినంటా నేల నన్ను దూరేవు
(॥అయ్యో॥)
కడుఁ జన్నుల నొత్తక గట్టిపడునా నీమేను
వొడివట్టి తియ్యక వొడఁబడేవా
చిడుముడిఁ బెనఁగక సిత్తులు విడిపడునా
గడుసరిదాననంటాఁ గాఁతాళించేవు
(॥అయ్యో॥)
సమరతులఁ గూడక చక్కనౌనా నీగుణము
తమకించి మోవియ్యక దప్పి దీరునా
అమర శ్రీవేంకటేశ యంతలో న న్నేలితివి
జమళిరట్టడినంటా సరస మాడేవు
(||pallavi||)
ayyo yippuḍichchagamu lāḍevu gāga
gayyāḽisem̐talam̐ gāga kaivaśha mayyevā
(||ayyo||)
kannula jaṁkiṁchaga karam̐gunā nīmanasu
sannalu śhāyaga yāsalu rem̐gunā
vunnadi ninnum̐gŏsara kūrage lonayyevā
yĕnnam̐ga ne gabbinaṁṭā nela nannu dūrevu
(||ayyo||)
kaḍum̐ jannula nŏttaga gaṭṭibaḍunā nīmenu
vŏḍivaṭṭi tiyyaga vŏḍam̐baḍevā
siḍumuḍim̐ bĕnam̐gaga sittulu viḍibaḍunā
gaḍusaridānanaṁṭām̐ gām̐tāḽiṁchevu
(||ayyo||)
samaradulam̐ gūḍaga sakkanaunā nīguṇamu
tamagiṁchi moviyyaga dappi dīrunā
amara śhrīveṁkaḍeśha yaṁtalo na nnelidivi
jamaḽiraṭṭaḍinaṁṭā sarasa māḍevu