అయ్యో యిన్నాళ్లు నీవే నే నని వుంటివి
(॥పల్లవి॥)
అయ్యో యిన్నాళ్లు నీవే నే నని వుంటివి
నెయ్యపు నీ కపటాలు నే నెరఁగ నయ్యా
(॥అయ్యో॥)
యీడు గానిచెలి నన్ను నే మేమో ఆడఁగాను
వేడుక నోరాఁ గన్నుల వినేవు నీవు
తాడుపడి నే నందుకు తరిఁ జిన్నఁ బో యుండఁగాఁ
గూడెనా నీ కే మైనాఁ గోరి కట్టుకోవయ్యా
(॥అయ్యో॥)
పుక్కటసతులు నాతో పురుఁడుకు రాఁగాను
దక్కెనా నీ పంత మదె తగఁ జూచేవు
పక్కన నే నిందుకుఁ గా పై పై నిన్ను దూరఁగాను
అక్కర దీరెనా నీకు నైతే నీచిత్తమయ్యా
(॥అయ్యో॥)
నడుమంత్రాన నొకతె నాయెదుట మురియఁగా
యెడయక సమ్మతాన నేల నవ్వేవు
బడినె శ్రీవెంకటేశ పాయక నేఁ గూడఁగాను
యెడపులవారిపోందు లేమి బాఁతి నీ కయ్యా
(||pallavi||)
ayyo yinnāḽlu nīve ne nani vuṁṭivi
nĕyyabu nī kabaḍālu ne nĕram̐ga nayyā
(||ayyo||)
yīḍu gānisĕli nannu ne memo āḍam̐gānu
veḍuga norām̐ gannula vinevu nīvu
tāḍubaḍi ne naṁdugu tarim̐ jinnam̐ bo yuṁḍam̐gām̐
gūḍĕnā nī ke mainām̐ gori kaṭṭugovayyā
(||ayyo||)
pukkaḍasadulu nādo purum̐ḍugu rām̐gānu
dakkĕnā nī paṁta madĕ tagam̐ jūsevu
pakkana ne niṁdugum̐ gā pai pai ninnu dūram̐gānu
akkara dīrĕnā nīgu naide nīsittamayyā
(||ayyo||)
naḍumaṁtrāna nŏgadĕ nāyĕduḍa muriyam̐gā
yĕḍayaga sammadāna nela navvevu
baḍinĕ śhrīvĕṁkaḍeśha pāyaga nem̐ gūḍam̐gānu
yĕḍabulavāriboṁdu lemi bām̐ti nī kayyā