అయ్యో యింకా నేలే అన్నియుఁ గానవచ్చెను
(॥పల్లవి॥)
అయ్యో యింకా నేలే అన్నియుఁ గానవచ్చెను
నెయ్యములేనిచోట నేరుపులు గలవా
(॥అయ్యో॥)
వలపుగలుగుచోట వడిఁ గొసరుట గాక
చలము సాదించుచోట సలి గేఁటికే
పిలువనంపినచోట బిగియవచ్చుఁ గాక
వలసి నొల్లనిచోట వాసు లెంచ నేఁటికే
(॥అయ్యో॥)
యేకతమై వున్నచోట నేమన్నానమరుఁ గాక
సాకిరివెట్టేటిచోట సాదించ నేలే
రాకపోకగలచోట రతి సమకూడుఁ గాక
కూకులు వత్తులు నైతే కూటములు గలవా
(॥అయ్యో॥)
మొగమోడేవానితోడ ముచ్చటాడవచ్చుఁ గాక
తెగనాడేవానితోటి తెరు వేఁటికే
అగపడి శ్రీవేంకటాధిపతి నన్నుఁ గూడె
తగులాయ సారె సారె తప్పులెంచ నేఁటికే
(||pallavi||)
ayyo yiṁkā nele anniyum̐ gānavachchĕnu
nĕyyamulenisoḍa nerubulu galavā
(||ayyo||)
valabugalugusoḍa vaḍim̐ gŏsaruḍa gāga
salamu sādiṁchusoḍa sali gem̐ṭige
piluvanaṁpinasoḍa bigiyavachchum̐ gāga
valasi nŏllanisoḍa vāsu lĕṁcha nem̐ṭige
(||ayyo||)
yegadamai vunnasoḍa nemannānamarum̐ gāga
sāgirivĕṭṭeḍisoḍa sādiṁcha nele
rāgabogagalasoḍa radi samagūḍum̐ gāga
kūgulu vattulu naide kūḍamulu galavā
(||ayyo||)
mŏgamoḍevānidoḍa muchchaḍāḍavachchum̐ gāga
tĕganāḍevānidoḍi tĕru vem̐ṭige
agabaḍi śhrīveṁkaḍādhibadi nannum̐ gūḍĕ
tagulāya sārĕ sārĕ tappulĕṁcha nem̐ṭige