Ayyo yemi soose nadiva(m) dappaga yitte

అయ్యో యేమి చూచే నతివ(ఁ) దప్పక యిట్టె
Language

(॥పల్లవి॥)
అయ్యో యేమి చూచే నతివ(ఁ) దప్పక యిట్టె
పయ్యద కొం గల్లార్చి పలికించవయ్యా

(॥అయ్యో॥)
చెక్కులవెంటఁగారేచెమట దుడువవయ్య
యిక్కడ నీకుఁ గైదండ యిచ్చి యలసె
లక్కవలెఁ గరఁగినలావణ్యరస మిదో
కక్కసపుఁగొప్పు మేఘపుజడివానలో

(॥అయ్యో॥)
సురటి విసరయ్య సుదతి నీకొప్పు దువ్వి
అరుదుగ నసురుసురాయ నిదె
పరిపరిజవ్వనముపైఁ బరవశమో
మరుసముకములోని మాటలతేటలో

(॥అయ్యో॥)
తమల మొసఁగవయ్య తరుణి నీమేను సోఁకి
తమకపురతిఁ జొక్కి దప్పిగొనెను
అమరఁగ శ్రీవేంకటాద్రీశ యిదియెల్లా
గొమరెవయసునను కోరినకోరికలో

(||pallavi||)
ayyo yemi sūse nadiva(m̐) dappaga yiṭṭĕ
payyada kŏṁ gallārsi paligiṁchavayyā

(||ayyo||)
sĕkkulavĕṁṭam̐gāresĕmaḍa duḍuvavayya
yikkaḍa nīgum̐ gaidaṁḍa yichchi yalasĕ
lakkavalĕm̐ garam̐ginalāvaṇyarasa mido
kakkasabum̐gŏppu meghabujaḍivānalo

(||ayyo||)
suraḍi visarayya sudadi nīgŏppu duvvi
aruduga nasurusurāya nidĕ
paribarijavvanamubaim̐ baravaśhamo
marusamugamuloni māḍaladeḍalo

(||ayyo||)
tamala mŏsam̐gavayya taruṇi nīmenu som̐ki
tamagaburadim̐ jŏkki dappigŏnĕnu
amaram̐ga śhrīveṁkaḍādrīśha yidiyĕllā
gŏmarĕvayasunanu korinagorigalo