Ayyo tanagela lomga nadi naasamtosame

అయ్యో తనకేల లోఁగ నది నాసంతోసమే
Language

(॥పల్లవి॥)
అయ్యో తనకేల లోఁగ నది నాసంతోసమే
నెయ్యపు విభుఁడు తాను నేఁ గాదనేనా

(॥అయ్యో॥)
ఘనుండు తా నెవ్వతెతోఁ గామించి నవ్వినాను
యెనలేని వేఁడుకతో నిట్టె చూచేనే
మనసిచ్చి యాపెకు తా మాటప ట్టేమిచ్చినాను
వొనగూడి యందుకెల్లా నొడఁబఱచేనే

(॥అయ్యో॥)
తలఁచి యాపెపొందు తాఁ గోరినా నీడకు
పిలుచుక వచ్చి వొద్దఁబెట్టే నే నేను
చెలి నెంత పెద్దసేయఁ జిత్తానఁ గలిగినాను
కల కాల మాపె కూడిగముసేసేనే

(॥అయ్యో॥)
యిరవుగఁ దా మిద్దరూ నెనసి వుండితేను
పరగఁగఁ బఱచేనే పానుపు నేను
సిరుల నలమేల్ మంగ శ్రీవేంకటేశుఁడు తాను
సరి నన్ను నేలినాఁడు చనవు చేకొంటినే

(||pallavi||)
ayyo tanagela lom̐ga nadi nāsaṁtosame
nĕyyabu vibhum̐ḍu tānu nem̐ gādanenā

(||ayyo||)
ghanuṁḍu tā nĕvvadĕdom̐ gāmiṁchi navvinānu
yĕnaleni vem̐ḍugado niṭṭĕ sūsene
manasichchi yābĕgu tā māḍaba ṭṭemichchinānu
vŏnagūḍi yaṁdugĕllā nŏḍam̐baṟasene

(||ayyo||)
talam̐si yābĕbŏṁdu tām̐ gorinā nīḍagu
pilusuga vachchi vŏddam̐bĕṭṭe ne nenu
sĕli nĕṁta pĕddaseyam̐ jittānam̐ galiginānu
kala kāla mābĕ kūḍigamusesene

(||ayyo||)
yiravugam̐ dā middarū nĕnasi vuṁḍidenu
paragam̐gam̐ baṟasene pānubu nenu
sirula nalamel maṁga śhrīveṁkaḍeśhum̐ḍu tānu
sari nannu nelinām̐ḍu sanavu segŏṁṭine