Ayyo nannoorage nee vaaradim bettevu gaaga

అయ్యో నన్నూరకె నీ వారడిఁ బెట్టేవు గాక
Language

(॥పల్లవి॥)
అయ్యో నన్నూరకె నీ వారడిఁ బెట్టేవు గాక
గయ్యాళించి యెన్నఁడైనాఁ గరఁగించితినా

(॥అయ్యో॥)
పెనఁగులాడు తా నీతో బిగి సేదాననా
ననుపుల సరసాల నవ్వితిఁ గాక
కొనచూపులనుఁ జూచి కొసరేటిదాననా
వినయపువేడుకలు వెదచల్లితిఁ గాక

(॥అయ్యో॥)
ఉప్పతించి నిన్ను దూరి వోరసేసేదాననా
చెప్పినాని కతలెల్లాఁ జెప్పితిఁగాక
కప్పురాన వేసి నిన్నుఁ గాఁక రేఁచేదాననా
దప్పిదేర మోవియిచ్చి తనుపుదుఁగాక

(॥అయ్యో॥)
ఆలు చూపి నిన్ను నలయించేదాననా
సేసవెట్టి నీకోరిక చెల్లింతుఁగాక
వేసరేటిదాననా శ్రీవేంకటేశ కూడితివి
మూసిన ముత్తెమువలె మొక్కుదుఁగాక

(||pallavi||)
ayyo nannūragĕ nī vāraḍim̐ bĕṭṭevu gāga
gayyāḽiṁchi yĕnnam̐ḍainām̐ garam̐giṁchidinā

(||ayyo||)
pĕnam̐gulāḍu tā nīdo bigi sedānanā
nanubula sarasāla navvidim̐ gāga
kŏnasūbulanum̐ jūsi kŏsareḍidānanā
vinayabuveḍugalu vĕdasallidim̐ gāga

(||ayyo||)
uppadiṁchi ninnu dūri vorasesedānanā
sĕppināni kadalĕllām̐ jĕppidim̐gāga
kappurāna vesi ninnum̐ gām̐ka rem̐sedānanā
dappidera moviyichchi tanubudum̐gāga

(||ayyo||)
ālu sūbi ninnu nalayiṁchedānanā
sesavĕṭṭi nīgoriga sĕlliṁtum̐gāga
vesareḍidānanā śhrīveṁkaḍeśha kūḍidivi
mūsina muttĕmuvalĕ mŏkkudum̐gāga