Ayyo mamchidagavaru laudure meeru

అయ్యో మంచితగవరు లౌదురే మీరు
Language

(॥పల్లవి॥)
అయ్యో మంచితగవరు లౌదురే మీరు
దయ్యమునైనా దూరఁ దగదా నాకు

(॥అయ్యో॥)
తలఁచినప్పుడు రాక తడసి వున్నందుకు
తలవంచుకొననైనాఁ దగదా నాకు
చలివాసి యాపెఁ దాను సంగడినున్నందుకు
తలుపుమాటునకుఁ బోఁ దగదా నాకు

(॥అయ్యో॥)
చిప్పిలి తానెక్కడో పెంజెమటతో నుండఁగాను
తప్పక చూడనైనాఁ దగదా నాకు
ముప్పిరిఁ గాఁగినచేత ముట్ట నన్ను రాఁగాను
తప్పించుకోనైనాను తగదా నాకు

(॥అయ్యో॥)
వుమ్మగిలికాని మాట లొండొకటి యాడఁగా
తమ్ముల ముమియ లేవఁ దగదా నాకు
కమ్మర శ్రీ వేంకటాద్రి ఘనుఁ డిట్టె నన్నుఁ గూడె
తమ్మిమోము విచ్చి నవ్వఁ దగదా నాకు

(||pallavi||)
ayyo maṁchidagavaru laudure mīru
dayyamunainā dūram̐ dagadā nāgu

(||ayyo||)
talam̐sinappuḍu rāga taḍasi vunnaṁdugu
talavaṁchugŏnanainām̐ dagadā nāgu
salivāsi yābĕm̐ dānu saṁgaḍinunnaṁdugu
talubumāḍunagum̐ bom̐ dagadā nāgu

(||ayyo||)
sippili tānĕkkaḍo pĕṁjĕmaḍado nuṁḍam̐gānu
tappaga sūḍanainām̐ dagadā nāgu
muppirim̐ gām̐ginaseda muṭṭa nannu rām̐gānu
tappiṁchugonainānu tagadā nāgu

(||ayyo||)
vummagiligāni māḍa lŏṁḍŏgaḍi yāḍam̐gā
tammula mumiya levam̐ dagadā nāgu
kammara śhrī veṁkaḍādri ghanum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
tammimomu vichchi navvam̐ dagadā nāgu