Ayyo aamdumdanamu amgadi veyam daguna

అయ్యో ఆఁడుఁదనము అంగడి వేయఁ దగున
Language

(॥పల్లవి॥)
అయ్యో ఆఁడుఁదనము అంగడి వేయఁ దగున
యియ్యడ నేఁ బ్రియమైతే యింత పచ్చి గలదా

(॥అయ్యో॥)
సిగ్గువడి నే నుండఁగఁ జేపట్టి తీసీఁ బై పై
యెగ్గెరఁగఁ డించుకంత యేమి సేతునే
దగ్గరనె వున్నవారు తరుణు లందరు నదే
బగ్గనఁ దాఁబైకొంటే పకపక నగరా

(॥అయ్యో॥)
యిదివో వంచనతోడ యేమీ ననకుండఁగాను
యెదురు మాఁటాడు మనీ నేమి సేతునే
అదన నెదుటనె అత్తమామ లున్నవారు
వదరు లిం తే లంటా వారైనఁ దిట్టరా

(॥అయ్యో॥)
ముప్పరి మంచముమీఁద మొగి నేఁ డుండఁ గాను
యిప్పుడె తా నిలుచున్నాఁ డేమి సేతునే
అప్పఁ డిదె శ్రీవెంటాద్రిపతి నన్నుఁ గూడె
దప్పి వోఁ బొరుగువారు తన్నునే పొగడరా

(||pallavi||)
ayyo ām̐ḍum̐danamu aṁgaḍi veyam̐ daguna
yiyyaḍa nem̐ briyamaide yiṁta pachchi galadā

(||ayyo||)
sigguvaḍi ne nuṁḍam̐gam̐ jebaṭṭi tīsīm̐ bai pai
yĕggĕram̐gam̐ ḍiṁchugaṁta yemi sedune
daggaranĕ vunnavāru taruṇu laṁdaru nade
bagganam̐ dām̐baigŏṁṭe pagabaga nagarā

(||ayyo||)
yidivo vaṁchanadoḍa yemī nanaguṁḍam̐gānu
yĕduru mām̐ṭāḍu manī nemi sedune
adana nĕduḍanĕ attamāma lunnavāru
vadaru liṁ te laṁṭā vārainam̐ diṭṭarā

(||ayyo||)
muppari maṁchamumīm̐da mŏgi nem̐ ḍuṁḍam̐ gānu
yippuḍĕ tā nilusunnām̐ ḍemi sedune
appam̐ ḍidĕ śhrīvĕṁṭādribadi nannum̐ gūḍĕ
dappi vom̐ bŏruguvāru tannune pŏgaḍarā