అయ్యే పను లేవిధాన నయ్యీఁ గాక
(॥పల్లవి॥)
అయ్యే పను లేవిధాన నయ్యీఁ గాక
చెయ్యారఁ జేసే పనికి సిగ్గు లిఁక నేలా
(॥అయ్యే॥)
పంతము లాడఁగ నేలే బలువులతోడను
చింతతో చెక్కిటిచేతి శిబ్బితె మేలు
చెంతలఁ బెనఁగఁ బోతే చేకత్తిగోళ్లే తాఁకు
నంతేసి లోఁతుల చొర నాఁడువారి కేలా
(॥అయ్యే॥)
కోరి నేరా లెంచ నేలే కొయ్యగాండ్లకుతోడ
వోరుచు కుంటే టస్సు రుసురే మేలు
యేరీతిఁ దమి రేఁచిన నీరు దియ్యఁ బేను వచ్చు
బారపుబండ్లకుఁ గాళ్లు పైం జాఁచ నేలే
(॥అయ్యే॥)
కడుఁ గడు నవ్వు లేలే కాములకులతోడను
చిడుముడిఁ జేసెటిసేవలే మేలు
అడరి శ్రీవెంకటేశుఁ డాతడే నన్నుఁ గూడె
విడువనిపొందులకు విచారము లేలే
(||pallavi||)
ayye panu levidhāna nayyīm̐ gāga
sĕyyāram̐ jese panigi siggu lim̐ka nelā
(||ayye||)
paṁtamu lāḍam̐ga nele baluvuladoḍanu
siṁtado sĕkkiḍisedi śhibbidĕ melu
sĕṁtalam̐ bĕnam̐gam̐ bode segattigoḽle tām̐ku
naṁtesi lom̐tula sŏra nām̐ḍuvāri kelā
(||ayye||)
kori nerā lĕṁcha nele kŏyyagāṁḍlagudoḍa
vorusu kuṁṭe ṭassu rusure melu
yerīdim̐ dami rem̐sina nīru diyyam̐ benu vachchu
bārabubaṁḍlagum̐ gāḽlu paiṁ jām̐sa nele
(||ayye||)
kaḍum̐ gaḍu navvu lele kāmulaguladoḍanu
siḍumuḍim̐ jesĕḍisevale melu
aḍari śhrīvĕṁkaḍeśhum̐ ḍādaḍe nannum̐ gūḍĕ
viḍuvanibŏṁdulagu visāramu lele