Ayinappu dayyeem gaani yinni panulunu meemda

అయినప్పు డయ్యీఁ గాని యిన్ని పనులును మీఁద
Language

(॥పల్లవి॥)
అయినప్పు డయ్యీఁ గాని యిన్ని పనులును మీఁద
దయలేనివానితోడఁ దగవా నాకు

(॥అయిన॥)
రెప్ప లెత్తి చూచితేనే రేసులు వుట్టె నీతో
తప్పు లెంచి కొసరఁగ తగవా నాకు
చప్పని వలపుతోడ చవిగానివేళ నిన్ను
తప్పని బాస లడుగఁ దగవా నాకు

(॥అయిన॥)
భ్రమసి యెక్కడనో పరాకైవున్న నీపై
తమకించి చేయి చాఁచఁ దగవా నాకు
చెమటలమేనితోడ చిందువందయి రాఁగాను
తమల మడుగనైనఁ దగనా నాకు

(॥అయిన॥)
సారె సారె నీవు నాతో సమ్మతి నాన వెట్టఁగా
తారుకాణకుఁ బిలువఁ దగవా నాకు
కూరిమి శ్రీ వేంకటేశ కూడితివి నన్ను నిట్టె
దార దప్పఁ బెనఁగఁగఁ దగవా నాకు

(||pallavi||)
ayinappu ḍayyīm̐ gāni yinni panulunu mīm̐da
dayalenivānidoḍam̐ dagavā nāgu

(||ayina||)
rĕppa lĕtti sūsidene resulu vuṭṭĕ nīdo
tappu lĕṁchi kŏsaram̐ga tagavā nāgu
sappani valabudoḍa savigāniveḽa ninnu
tappani bāsa laḍugam̐ dagavā nāgu

(||ayina||)
bhramasi yĕkkaḍano parāgaivunna nībai
tamagiṁchi seyi sām̐sam̐ dagavā nāgu
sĕmaḍalamenidoḍa siṁduvaṁdayi rām̐gānu
tamala maḍuganainam̐ daganā nāgu

(||ayina||)
sārĕ sārĕ nīvu nādo sammadi nāna vĕṭṭam̐gā
tārugāṇagum̐ biluvam̐ dagavā nāgu
kūrimi śhrī veṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
dāra dappam̐ bĕnam̐gam̐gam̐ dagavā nāgu