అవ్వలివారికే నీ వన్నియు నేరుపవయ్య
(॥పల్లవి॥)
అవ్వలివారికే నీ వన్నియు నేరుపవయ్య
రవ్వగానివారి నేల రచ్చనఁ బెట్టేవు
(॥అవ్వలి॥)
కాటుక కన్నుల నిన్నుఁ గసరఁగఁ జాలఁగాని
నాటఁజూచి కొంత గొంత నవ్వు నవ్వేరా
తేటలుగాఁ బేరు గుచ్చి తిట్టుమనే వప్పటిని
గాఁట్టిసిగ్గయ్యీ నాకు కమ్మటి నేనోపరా
(॥అవ్వలి॥)
అంకెకు రావని నీతో నలుగఁగ నోపఁ గాని
వుంకువగాఁ గుచముల నొత్తఁగలరా
సంకె లేక నీమీఁదఁ జాఁచుమనేవు పాదాలు
అంకెల సిగ్గయ్యీ నాకు నందుకు నేనోపరా
(॥అవ్వలి॥)
కాఁగిట నీవు గూడఁగ గయ్యాళించఁజాలఁగాని
మాఁగిననామోని గొంత మచ్చు వేసేరా
చేఁగదేర నప్పటిని శ్రీవేంకటేశ యేలితి
దాఁగితే సిగ్గయ్యీ నాకు తలఁగ నేనోపరా
(||pallavi||)
avvalivārige nī vanniyu nerubavayya
ravvagānivāri nela rachchanam̐ bĕṭṭevu
(||avvali||)
kāḍuga kannula ninnum̐ gasaram̐gam̐ jālam̐gāni
nāḍam̐jūsi kŏṁta gŏṁta navvu navverā
teḍalugām̐ beru guchchi tiṭṭumane vappaḍini
gām̐ṭṭisiggayyī nāgu kammaḍi nenobarā
(||avvali||)
aṁkĕgu rāvani nīdo nalugam̐ga nobam̐ gāni
vuṁkuvagām̐ gusamula nŏttam̐galarā
saṁkĕ lega nīmīm̐dam̐ jām̐sumanevu pādālu
aṁkĕla siggayyī nāgu naṁdugu nenobarā
(||avvali||)
kām̐giḍa nīvu gūḍam̐ga gayyāḽiṁcham̐jālam̐gāni
mām̐ginanāmoni gŏṁta machchu veserā
sem̐gadera nappaḍini śhrīveṁkaḍeśha yelidi
dām̐gide siggayyī nāgu talam̐ga nenobarā