అవ్వలిమోమేలయ్యే వాపెతో మాటాడవయ్య
(॥పల్లవి॥)
అవ్వలిమోమేలయ్యే వాపెతో మాటాడవయ్య
అవ్వల నాకెకుఁ గాను ఇందవయ్య కానిక
(॥॥)
పాసి వుండ లేని సతి పంతమే పనికివచ్చు
వాసికత్తె మేని గర్వ మెంతటిది
సేసపాల పెండ్లికూఁతు చేఁతలు కిందుపడేవే
యీసు లే దాకెకు నీపై యిందవమ్మ కానిక
(॥॥)
వొక్క మంచముపై కాంత వొట్టు లెందాఁకా నుండు
దక్కిన దాని గయ్యాళి తన మేఁటిదే
లక్కవంటి మనసు లలన కేడ చలము
యిక్కువలు మఱవకు యిందవయ్య కానిక
(॥॥)
నీకు నాస పడి యున్న నెలఁత కేమి బీరము
కై కొన్న విరహిణి కెక్కడి గుట్టు
చేకొంటి వీకె నింతలో శ్రీ వేంకటేశ దయతో
యీకడ సంతోసమాయ నిందవయ్య కానిక
(||pallavi||)
avvalimomelayye vābĕdo māḍāḍavayya
avvala nāgĕgum̐ gānu iṁdavayya kāniga
(||||)
pāsi vuṁḍa leni sadi paṁtame panigivachchu
vāsigattĕ meni garva mĕṁtaḍidi
sesabāla pĕṁḍligūm̐tu sem̐talu kiṁdubaḍeve
yīsu le dāgĕgu nībai yiṁdavamma kāniga
(||||)
vŏkka maṁchamubai kāṁta vŏṭṭu lĕṁdām̐kā nuṁḍu
dakkina dāni gayyāḽi tana mem̐ṭide
lakkavaṁṭi manasu lalana keḍa salamu
yikkuvalu maṟavagu yiṁdavayya kāniga
(||||)
nīgu nāsa paḍi yunna nĕlam̐ta kemi bīramu
kai kŏnna virahiṇi kĕkkaḍi guṭṭu
segŏṁṭi vīgĕ niṁtalo śhrī veṁkaḍeśha dayado
yīgaḍa saṁtosamāya niṁdavayya kāniga