అవ్వలి మోమే(మేఁ)టికే అంతవానితో
(॥పల్లవి॥)
అవ్వలి మోమే(మేఁ)టికే అంతవానితో
నవ్వులు నవేటివేళ ననుపులే కాక
(॥అవ్వ॥)
ఆఁటదానికేఁటికే అంతేసి చలములు
పేటగా మగవానితో ప్రియమేకాక
యీటువెట్టి నీకతఁడు యెంత కిందుపడినాను
చీటికి మాటికి సేవ సేయవలెఁగాక
(॥అవ్వ॥)
మగువకు నేఁటికే మాసటీని పంతాలు
మొగము చూచి సన్నల మొక్కులే కాక
జగడము దీర నెంత చనవు నీకిచ్చినాను
మిగుల నీ వినయాలే మించవలె గాక
(॥అవ్వ॥)
సతికి నింతేఁటికే సరిచేసి బింకాలు
యితవైన మనసుల యేకమేకాక
వెత దీర నిన్నును శ్రీ వేంకటేశుఁ డిదె కూడె
మితిలే కిందుకే నీవు మెచ్చవలెఁగాక
(||pallavi||)
avvali mome(mem̐)ṭige aṁtavānido
navvulu naveḍiveḽa nanubule kāga
(||avva||)
ām̐ṭadānigem̐ṭige aṁtesi salamulu
peḍagā magavānido priyamegāga
yīḍuvĕṭṭi nīgadam̐ḍu yĕṁta kiṁdubaḍinānu
sīḍigi māḍigi seva seyavalĕm̐gāga
(||avva||)
maguvagu nem̐ṭige māsaḍīni paṁtālu
mŏgamu sūsi sannala mŏkkule kāga
jagaḍamu dīra nĕṁta sanavu nīgichchinānu
migula nī vinayāle miṁchavalĕ gāga
(||avva||)
sadigi niṁtem̐ṭige sarisesi biṁkālu
yidavaina manasula yegamegāga
vĕda dīra ninnunu śhrī veṁkaḍeśhum̐ ḍidĕ kūḍĕ
midile kiṁduge nīvu mĕchchavalĕm̐gāga