అవురవురా (ఔరౌరా?)బాలుఁడా ఆయమంటే వింతలోనె
(॥పల్లవి॥)
అవురవురా (ఔరౌరా?)బాలుఁడా ఆయమంటే వింతలోనె
సారెసారె ముద్దులెల్లా చల్లేవేరా బాలుఁడ(డా?)
(॥అవు॥)
ముంగిటనున్నవారి మూలకుఁ బిలిచి నీవు
యెంగిలి సేసేవు మోవి యేరా బాలుఁడ
అంగవించి బెట్టిమాట లాడెనంటా నోరుమూసి
వుంగరాలవేళ్లనేల వూఁచేవేరా బాలుఁడ
(॥అవు॥)
యేకతమాడేనంటా యేడేడో బూతుమాటలు
పైకొని ఆడేవేరా పసిబాలుఁడ
కాకుసేయకు మనుచు కమ్మర పరాకుగాను
కేకిసలై గిలిగించి కేరేవేరా బాలుఁడా
(॥అవు॥)
అప్ప లప్ప లాడే నంటా నంతలోనె కాఁగిలించి
చిప్పిలఁ గూడితి వవురా చిన్నిబాలుఁడా
మెప్పించి శ్రీ వేంకటాద్రిమీఁద నన్ను నురమున
తెప్పలఁదేలించితివి దిమ్మరి వోబాలుఁడా
(||pallavi||)
avuravurā (auraurā?)bālum̐ḍā āyamaṁṭe viṁtalonĕ
sārĕsārĕ muddulĕllā salleverā bālum̐ḍa(ḍā?)
(||avu||)
muṁgiḍanunnavāri mūlagum̐ bilisi nīvu
yĕṁgili sesevu movi yerā bālum̐ḍa
aṁgaviṁchi bĕṭṭimāḍa lāḍĕnaṁṭā norumūsi
vuṁgarālaveḽlanela vūm̐severā bālum̐ḍa
(||avu||)
yegadamāḍenaṁṭā yeḍeḍo būdumāḍalu
paigŏni āḍeverā pasibālum̐ḍa
kāguseyagu manusu kammara parāgugānu
kegisalai giligiṁchi kereverā bālum̐ḍā
(||avu||)
appa lappa lāḍe naṁṭā naṁtalonĕ kām̐giliṁchi
sippilam̐ gūḍidi vavurā sinnibālum̐ḍā
mĕppiṁchi śhrī veṁkaḍādrimīm̐da nannu nuramuna
tĕppalam̐deliṁchidivi dimmari vobālum̐ḍā