Avune bhaagyamamturaala vaidive neevu

అవునే భాగ్యమంతురాల వైతివే నీవు
Language

(॥పల్లవి॥)
అవునే భాగ్యమంతురాల వైతివే నీవు
వివరించి నీ సుద్దులు వింటిమే నేము

(॥॥)
తలఁపులో మెలఁగేటి తగినపతి గలితే
వలుపే ధనము గాదా వనితలకు
యెలమిఁ జక్కఁదనాన నిన్నిటాను మించితేను
నిలువు నూరువండుట నిజము గాదా

(॥॥)
సరవి సింగారాలతో జవ్వనము సతమైతే
సుమరతమే సంపదగా సుదతులకు
ఇరవై ఇన్నిటాఁదన కేకచిత్తమైతేను
వరుస వేయిట్టిపై జవ్వాదికొమ్ము గాదా

(॥॥)
తతితోడఁ గాఁగిటఁ దగిలి పాయకుండితే
రతియే సామ్రాజ్యము రమణులకు
ఇతవై శ్రీవేంకటేశుఁడేలె నిన్ను నిట్టయితే
మితిఁ గోటికిఁ బడగె మించెత్తుట గాదా

(||pallavi||)
avune bhāgyamaṁturāla vaidive nīvu
vivariṁchi nī suddulu viṁṭime nemu

(||||)
talam̐pulo mĕlam̐geḍi taginabadi galide
valube dhanamu gādā vanidalagu
yĕlamim̐ jakkam̐danāna ninniḍānu miṁchidenu
niluvu nūruvaṁḍuḍa nijamu gādā

(||||)
saravi siṁgārālado javvanamu sadamaide
sumaradame saṁpadagā sudadulagu
iravai inniḍām̐dana kegasittamaidenu
varusa veyiṭṭibai javvādigŏmmu gādā

(||||)
tadidoḍam̐ gām̐giḍam̐ dagili pāyaguṁḍide
radiye sāmrājyamu ramaṇulagu
idavai śhrīveṁkaḍeśhum̐ḍelĕ ninnu niṭṭayide
midim̐ goḍigim̐ baḍagĕ miṁchĕttuḍa gādā