అవునయ్య నీసుద్దు లటువంటివి
(॥పల్లవి॥)
అవునయ్య నీసుద్దు లటువంటివి
జవళితో నంటుబచ్చలివంటివాఁడవు
(॥॥)
చెలరేఁగి యేడలేని చేఁతలెల్లాఁజేసివచ్చి
వెలయ నిప్పుడు నన్ను వేఁడుకొనేవు
పలుమారు నీచేత బాసలుగొన వెరతు
కలువకంటులయెడ కాతరీఁడ వనుచు
(॥॥)
వాడవారిపైనెల్లా వలపులు చల్లి వచ్చి
యీడ నాతో నేడలేని యిచ్చలాడేవు
కోడెకాఁడ నీవోజ కొనియాడ సిబ్బితయ్యీ
జాడతో నింతులయెడ చంచలుఁడ వనుచు
(॥॥)
పెక్కుగోపికలనెల్లా బెండ్లాడి యిట వచ్చి
గక్కన నాకాఁగిటఁగలసితివి
నిక్కి శ్రీ వేంకటేశుఁడ నే నలమేల్మంగను
కక్కసించ నోప నీవు గబ్బివాఁడ వనుచు
(||pallavi||)
avunayya nīsuddu laḍuvaṁṭivi
javaḽido naṁṭubachchalivaṁṭivām̐ḍavu
(||||)
sĕlarem̐gi yeḍaleni sem̐talĕllām̐jesivachchi
vĕlaya nippuḍu nannu vem̐ḍugŏnevu
palumāru nīseda bāsalugŏna vĕradu
kaluvagaṁṭulayĕḍa kādarīm̐ḍa vanusu
(||||)
vāḍavāribainĕllā valabulu salli vachchi
yīḍa nādo neḍaleni yichchalāḍevu
koḍĕgām̐ḍa nīvoja kŏniyāḍa sibbidayyī
jāḍado niṁtulayĕḍa saṁchalum̐ḍa vanusu
(||||)
pĕkkugobigalanĕllā bĕṁḍlāḍi yiḍa vachchi
gakkana nāgām̐giḍam̐galasidivi
nikki śhrī veṁkaḍeśhum̐ḍa ne nalamelmaṁganu
kakkasiṁcha noba nīvu gabbivām̐ḍa vanusu