Avunayya mamchivaamda vannidaa neevu

అవునయ్య మంచివాఁడ వన్నిటా నీవు
Language

(॥పల్లవి॥)
అవునయ్య మంచివాఁడ వన్నిటా నీవు
యివల నిన్నేమందు నెంత కాఁతరీఁడవు

(॥అవు॥)
చెప్పుదునా ఆపెతోడ చెంది నీసేసినచేఁత
యిప్పు డిట్టె వింటేను యేమను నిన్ను
చెప్పరానివిశ్వాసిచెలికత్తెలము నేము
కొప్పువట్టి మాపయ్యదకొం గంటఁదగునా

(॥అవు॥)
చూపుదునా ఆపెకు సొమ్ములు నీవిచ్చినవి
ఆపనుల కేమని ఆడునో నిన్ను
వోపికతో నితవరివూడిగపువారము
చేపట్టి మాచెక్కులను జీరఁదియ్యఁదగునా

(॥అవు॥)
సాకిరి దెలుపుదునా సరి నీనవ్విననవ్వు
తూకొనెలమేల్మం గెంతదూరునో నిన్ను
యీకడ శ్రీవేంకటేశ ఇద్దరి నమ్మినవార
మేకొలఁదిఁ(ది?) గాఁగిలించి యింత మెచ్చఁదగునా

(||pallavi||)
avunayya maṁchivām̐ḍa vanniḍā nīvu
yivala ninnemaṁdu nĕṁta kām̐tarīm̐ḍavu

(||avu||)
sĕppudunā ābĕdoḍa sĕṁdi nīsesinasem̐ta
yippu ḍiṭṭĕ viṁṭenu yemanu ninnu
sĕpparāniviśhvāsisĕligattĕlamu nemu
kŏppuvaṭṭi mābayyadagŏṁ gaṁṭam̐dagunā

(||avu||)
sūbudunā ābĕgu sŏmmulu nīvichchinavi
ābanula kemani āḍuno ninnu
vobigado nidavarivūḍigabuvāramu
sebaṭṭi māsĕkkulanu jīram̐diyyam̐dagunā

(||avu||)
sāgiri dĕlubudunā sari nīnavvinanavvu
tūgŏnĕlamelmaṁ gĕṁtadūruno ninnu
yīgaḍa śhrīveṁkaḍeśha iddari namminavāra
megŏlam̐dim̐(di?) gām̐giliṁchi yiṁta mĕchcham̐dagunā