అవునయ్య మంచివాఁడ వంతే కాదా
(॥పల్లవి॥)
అవునయ్య మంచివాఁడ వంతే కాదా
రవళిఁ బొరుగు పోరచి వెదకేవూ
(॥॥)
నెలఁత యింటిలో నుండి నినుఁ బిలువ నంపితే
చెలికత్తెపై నేల చేయి చాఁచేవు
కలికి యంపినయట్టి కానుక నీ కిచ్చితేను
చలివాసి యంతేసి జాణతనాలాడేవు
(॥॥)
ఆడనుండి గందము నీ కంపఁగాఁ దెచ్చితి మింతే
వూడిగపు వారి నేల వొడివట్టేవు
యీడ నీకుఁ జెవిలోన నే కాంతము చెప్పితిమి
వాడుమోవి చవిగొని వలఁబెట్టేవూ
(॥॥)
నంటున నలమేల్మంగ నవ్వి నీ వురమెక్కితే
వెంట వచ్చిన మమ్మును వెసఁగూడేవూ
గొంట వై శ్రీ వేంకటేశ కూడె నాపె నీ దేవులు
అంటుకొని మమ్ము నెంత ఆదరించేవూ
(||pallavi||)
avunayya maṁchivām̐ḍa vaṁte kādā
ravaḽim̐ bŏrugu porasi vĕdagevū
(||||)
nĕlam̐ta yiṁṭilo nuṁḍi ninum̐ biluva naṁpide
sĕligattĕbai nela seyi sām̐sevu
kaligi yaṁpinayaṭṭi kānuga nī kichchidenu
salivāsi yaṁtesi jāṇadanālāḍevu
(||||)
āḍanuṁḍi gaṁdamu nī kaṁpam̐gām̐ dĕchchidi miṁte
vūḍigabu vāri nela vŏḍivaṭṭevu
yīḍa nīgum̐ jĕvilona ne kāṁtamu sĕppidimi
vāḍumovi savigŏni valam̐bĕṭṭevū
(||||)
naṁṭuna nalamelmaṁga navvi nī vuramĕkkide
vĕṁṭa vachchina mammunu vĕsam̐gūḍevū
gŏṁṭa vai śhrī veṁkaḍeśha kūḍĕ nābĕ nī devulu
aṁṭugŏni mammu nĕṁta ādariṁchevū