Avunayya mamchivaada vamdugu doragomtivi

అవునయ్య మంచివాడ వందుకు దొరకొంటివి
Language

(॥పల్లవి॥)
అవునయ్య మంచివాడ వందుకు దొరకొంటివి
కవగడే మగువలు గాతల కోపుదురా

(॥॥)
చేరిచేరి నీతోను సిగ్గులు వడఁగానే
గోర గీరేవేమయ్య కోమలిని
ఆరితేరినవాడవు అన్నిటికి నోపుదువు
వూరివారి కన్నెక లోపుదురా ఇందుకు

(॥॥)
తడఁబడి చేతులను తప్పించుకొనఁగానే
యెడయక చన్నులంటే విదేమయ్య
కడు సాములు సేతువు కలదు సత్తువ నీకు
వొడికపు జవ్వనులు వోపుదురా ఇందుకు

(॥॥)
పొందులు చూపి దయలు వుట్ట మాటలాడఁగానే
కిందుపడ రతులఁ జొక్కించితివయ్య
విందుల శ్రీవేంకటేశ వేడుకతోఁ గూడితివి
వొందిలి మానినులెల్లా నోపుదురా ఇందుకు

(||pallavi||)
avunayya maṁchivāḍa vaṁdugu dŏragŏṁṭivi
kavagaḍe maguvalu gādala kobudurā

(||||)
seriseri nīdonu siggulu vaḍam̐gāne
gora gīrevemayya komalini
āriderinavāḍavu anniḍigi nobuduvu
vūrivāri kannĕga lobudurā iṁdugu

(||||)
taḍam̐baḍi sedulanu tappiṁchugŏnam̐gāne
yĕḍayaga sannulaṁṭe videmayya
kaḍu sāmulu seduvu kaladu sattuva nīgu
vŏḍigabu javvanulu vobudurā iṁdugu

(||||)
pŏṁdulu sūbi dayalu vuṭṭa māḍalāḍam̐gāne
kiṁdubaḍa radulam̐ jŏkkiṁchidivayya
viṁdula śhrīveṁkaḍeśha veḍugadom̐ gūḍidivi
vŏṁdili māninulĕllā nobudurā iṁdugu