Avumgaamu lerimgimchu mamte saalu

అవుఁగాము లెరిఁగించు మంతే చాలు
Language

(॥పల్లవి॥)
అవుఁగాము లెరిఁగించు మంతే చాలు
వువిద వొక్కమతితో నుండేము నేము

(॥ఆవు॥)
పిలిచినా రావు ప్రియమూఁ జేసేవు
యెలమి రెండూ నడుపే విదియేఁటిదే
అలరి యమ్మేదొకటి యసిమలఁ దొకటాయ
చెలి యాతని కేమని చెప్పుదుమే నేము

(॥ఆవు॥)
అదె చలము సాదించే వాదరమూ నించేవు
మెదుట రెండూ నడుపే విదియేఁటిదే
యిది యేలే చంక దుడ్డూ నింతలోనే శరణార్ది
పొదిగి యాడ కెట్లఁబోదు మే నేము

(॥ఆవు॥)
వింతరతిఁ గూడేవు విఱ వీఁగి భ్రమసేవు
యింతలో రెండూ నడుపే విదియేఁటిదే
ఆంతటిశ్రీవేంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడె
మంతనాన మెచ్చ కెట్టు మానుదుమే నేము

(||pallavi||)
avum̐gāmu lĕrim̐giṁchu maṁte sālu
vuvida vŏkkamadido nuṁḍemu nemu

(||āvu||)
pilisinā rāvu priyamūm̐ jesevu
yĕlami rĕṁḍū naḍube vidiyem̐ṭide
alari yammedŏgaḍi yasimalam̐ dŏgaḍāya
sĕli yādani kemani sĕppudume nemu

(||āvu||)
adĕ salamu sādiṁche vādaramū niṁchevu
mĕduḍa rĕṁḍū naḍube vidiyem̐ṭide
yidi yele saṁka duḍḍū niṁtalone śharaṇārdi
pŏdigi yāḍa kĕṭlam̐bodu me nemu

(||āvu||)
viṁtaradim̐ gūḍevu viṟa vīm̐gi bhramasevu
yiṁtalo rĕṁḍū naḍube vidiyem̐ṭide
āṁtaḍiśhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi nannum̐ gūḍĕ
maṁtanāna mĕchcha kĕṭṭu mānudume nemu