Avuleve yemmelemi aadugoneve

అవులేవే యెమ్మెలేమి ఆడుకొనేవే
Language

(॥పల్లవి॥)
అవులేవే యెమ్మెలేమి ఆడుకొనేవే
చివురై మీఁద మరి చేవగాకపోదు

(॥అవు॥)
నగవచ్చుఁగాని మారి నగినట్టె తమలోన
జిగిమీరఁ బొందులు సేయరాదు
మొగమోటలుఁ గలవు ముంచి యంకెకు రాకుంటే
అగడు సేసేకోపము లణఁచఁగరాదు

(॥అవు॥)
మాటలాడవచ్చుఁగాని మాటలాడినట్లానే
మేటియైన రతులను మెప్చించరాదు
పాటించి మొక్కఁగఁదగు పంతములు మీరితేను
నీటునఁ జుట్టరికాలు నెరపఁగరాదు

(॥అవు॥)
పెనఁగఁగవచ్చుఁగాని పెనఁగినయట్టానే
చనవులు చెల్లించి జరపరాదు
యెనసితివి శ్రీవేంకటేశు కరుణయు మించె
ననునేలె నీతని మానఁగ నిఁక రాదు

(||pallavi||)
avuleve yĕmmĕlemi āḍugŏneve
sivurai mīm̐da mari sevagāgabodu

(||avu||)
nagavachchum̐gāni māri naginaṭṭĕ tamalona
jigimīram̐ bŏṁdulu seyarādu
mŏgamoḍalum̐ galavu muṁchi yaṁkĕgu rāguṁṭe
agaḍu sesegobamu laṇam̐sam̐garādu

(||avu||)
māḍalāḍavachchum̐gāni māḍalāḍinaṭlāne
meḍiyaina radulanu mĕpchiṁcharādu
pāḍiṁchi mŏkkam̐gam̐dagu paṁtamulu mīridenu
nīḍunam̐ juṭṭarigālu nĕrabam̐garādu

(||avu||)
pĕnam̐gam̐gavachchum̐gāni pĕnam̐ginayaṭṭāne
sanavulu sĕlliṁchi jarabarādu
yĕnasidivi śhrīveṁkaḍeśhu karuṇayu miṁchĕ
nanunelĕ nīdani mānam̐ga nim̐ka rādu