అవులే యెంతలేదు నీ యాసోదము
(॥పల్లవి॥)
అవులే యెంతలేదు నీ యాసోదము
చవులమీఁదాఁ జవులైతే సందడిగాదా
(॥ఆవు॥)
చెంతనాపె మాటాడగా చేరి నేనాడననేవు
పంతాన సరుసఁ బార బండికండ్లా
బంతిని మోహమొక్కతెపై నిలిచి వుండఁగాను
దొంతివలపు నేఁజల్ల దోసము గాదా
(॥ఆవు॥)
మంచమెక్కాపె వుండఁగా మరినేరాననేవు
పంచపెట్ట నిదియేమి బంతికూళ్లా
యించుకంత చనవాకె కెక్కుడిచ్చి వుండఁగాను
చంచుల నేఁ బైకొనేది చప్పనేకాదా
(॥ఆవు॥)
పొత్తలనాపె వుండఁగా బువ్వానకు రమ్మనేవు
కొత్తలుగా నిదియేమి గొల్లదోమటా
యిత్తల శ్రీవేంకటేశ యిటు నన్నుఁగూడితివి
తత్తరించకుండ నిఁకఁ దగవేకాదా
(||pallavi||)
avule yĕṁtaledu nī yāsodamu
savulamīm̐dām̐ javulaide saṁdaḍigādā
(||āvu||)
sĕṁtanābĕ māḍāḍagā seri nenāḍananevu
paṁtāna sarusam̐ bāra baṁḍigaṁḍlā
baṁtini mohamŏkkadĕbai nilisi vuṁḍam̐gānu
dŏṁtivalabu nem̐jalla dosamu gādā
(||āvu||)
maṁchamĕkkābĕ vuṁḍam̐gā marinerānanevu
paṁchabĕṭṭa nidiyemi baṁtigūḽlā
yiṁchugaṁta sanavāgĕ kĕkkuḍichchi vuṁḍam̐gānu
saṁchula nem̐ baigŏnedi sappanegādā
(||āvu||)
pŏttalanābĕ vuṁḍam̐gā buvvānagu rammanevu
kŏttalugā nidiyemi gŏlladomaḍā
yittala śhrīveṁkaḍeśha yiḍu nannum̐gūḍidivi
tattariṁchaguṁḍa nim̐kam̐ dagavegādā