అవిగో నావిన్నపము లన్నియు నందె వున్నవి
(॥పల్లవి॥)
అవిగో నావిన్నపము లన్నియు నందె వున్నవి
తివిరి యేలడిగేరు తెలుసుకోరే
(॥అవి॥)
పూనుక ఆతనికిఁగా బుద్ధి నాకెంత చెప్పేరు
వీనుల నన్ని సుద్దులు వింటినే నేను
కానుక యిచ్చితి నని కాంతునికి పూవుదండ
మోనతోఁ జేతి కిచ్చి మొక్కరే నామారు
(॥అవి॥)
యీరీతి నిందరు నన్ను నేల వొడఁబరచేరు
కూరిమి నివెల్లా నెరుఁగుదునే నేను
వూరకే నాకుంచెను నావూడిగముగ విసరి
గారవించి మేలని పొగడరే నామారు
(॥అవి॥)
తలపోసి నాకేమి తారుకాణించ వచ్చేరు
కలదెల్లా నాకన్నులఁ గంటి నేను
యెలమి శ్రీవేంకటేశుఁ డీడ వచ్చి నన్ను నేలె
నిలువున సేసలు నించరే నామారు
(||pallavi||)
avigo nāvinnabamu lanniyu naṁdĕ vunnavi
tiviri yelaḍigeru tĕlusugore
(||avi||)
pūnuga ādanigim̐gā buddhi nāgĕṁta sĕpperu
vīnula nanni suddulu viṁṭine nenu
kānuga yichchidi nani kāṁtunigi pūvudaṁḍa
monadom̐ jedi kichchi mŏkkare nāmāru
(||avi||)
yīrīdi niṁdaru nannu nela vŏḍam̐baraseru
kūrimi nivĕllā nĕrum̐gudune nenu
vūrage nāguṁchĕnu nāvūḍigamuga visari
gāraviṁchi melani pŏgaḍare nāmāru
(||avi||)
talabosi nāgemi tārugāṇiṁcha vachcheru
kaladĕllā nāgannulam̐ gaṁṭi nenu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍīḍa vachchi nannu nelĕ
niluvuna sesalu niṁchare nāmāru