అవి యేఁటి యేకాంతాలో అడుగవయ్యా
(॥పల్లవి॥)
అవి యేఁటి యేకాంతాలో అడుగవయ్యా
తివిరీ నప్పటనుండి తెలుసుకోవయ్యా
(॥అవి॥)
కన్నులఁ దప్పక చూచి కడు బొమ్మల జింకించి
సన్నలుసేసీ నాకె సారెకు నీతో
చిన్నిపెదవుల లోలోసిగ్గుతోనె మాఁటలాడి
ఇన్నేసి చేఁతలు సేసి యిట్టె యేఁకారీని
(॥అవి॥)
చుట్టి చుట్టి లాచి లాచి సోఁకఁ గప్పురాన వేశి
గుట్టుతోఁ గొలువులోనఁ గొసరీ నిన్ను
పట్టెఁడేసి చన్నులు పచారించి నీకుఁ జూపి
నెట్టన నప్పటనుండి నీకుఁ బొంచుకున్నది
(॥అవి॥)
చిప్పిలఁగ నవ్వు నవ్వీ చేతులు నీపైఁ జాఁచి
చొప్పువేసీఁ జెప్పరాని చుట్టరికము
యిప్పుడు శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
కప్పి పయ్యదమాఁటునఁ గరఁగించీ నిన్నును
(||pallavi||)
avi yem̐ṭi yegāṁtālo aḍugavayyā
tivirī nappaḍanuṁḍi tĕlusugovayyā
(||avi||)
kannulam̐ dappaga sūsi kaḍu bŏmmala jiṁkiṁchi
sannalusesī nāgĕ sārĕgu nīdo
sinnibĕdavula lolosiggudonĕ mām̐ṭalāḍi
innesi sem̐talu sesi yiṭṭĕ yem̐kārīni
(||avi||)
suṭṭi suṭṭi lāsi lāsi som̐kam̐ gappurāna veśhi
guṭṭudom̐ gŏluvulonam̐ gŏsarī ninnu
paṭṭĕm̐ḍesi sannulu pasāriṁchi nīgum̐ jūbi
nĕṭṭana nappaḍanuṁḍi nīgum̐ bŏṁchugunnadi
(||avi||)
sippilam̐ga navvu navvī sedulu nībaim̐ jām̐si
sŏppuvesīm̐ jĕpparāni suṭṭarigamu
yippuḍu śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
kappi payyadamām̐ṭunam̐ garam̐giṁchī ninnunu