(॥పల్లవి॥)
అవి యటు భావించినట్లాను
కవగొని యిందుకుఁ గలఁగరు ఘనులు
(॥అవి॥)
అరయఁగ నేఁబదియక్షరములె పో
ధరలోపల నిందాస్తుతులు
సరిఁ బురాణములు శాస్త్రవేదములు
యిరవుగ నిన్నియు నిందే పొడమె
(॥అవి॥)
వొక్క దేహమున నున్నయంగములు
పెక్కువిధములై బెరసినవి
చిక్కులఁ గొన్నిటి సిగ్గుల దాఁతురు
యెక్కువ యతులకు నిన్నియు సమము
(॥అవి॥)
అంతరాత్మలో నంతర్యామై
బంతులఁ దిరిగేటి బంధువులు
చింతింప నతఁడే శ్రీవేంకటేశ్వరుఁ-
డింతకుఁ గర్తని యెంతురు బుధులు
(||pallavi||)
avi yaḍu bhāviṁchinaṭlānu
kavagŏni yiṁdugum̐ galam̐garu ghanulu
(||avi||)
arayam̐ga nem̐badiyakṣharamulĕ po
dharalobala niṁdāstudulu
sarim̐ burāṇamulu śhāstravedamulu
yiravuga ninniyu niṁde pŏḍamĕ
(||avi||)
vŏkka dehamuna nunnayaṁgamulu
pĕkkuvidhamulai bĕrasinavi
sikkulam̐ gŏnniḍi siggula dām̐turu
yĕkkuva yadulagu ninniyu samamu
(||avi||)
aṁtarātmalo naṁtaryāmai
baṁtulam̐ dirigeḍi baṁdhuvulu
siṁtiṁpa nadam̐ḍe śhrīveṁkaḍeśhvarum̐-
ḍiṁtagum̐ gardani yĕṁturu budhulu