Avi naameemdam bettagu mappadi neevu

అవి నామీఁదఁ బెట్టకు మప్పటి నీవు
Language

(॥పల్లవి॥)
అవి నామీఁదఁ బెట్టకు మప్పటి నీవు
కవగూడ నేర్చితివి కతలుగా నీవు

(॥అవి॥)
నగితే నేమిఁగాదు నలుగురిలో నాను
తగినమాటలాడు తరమెఱిఁగి
జగతిలో నానాజాతిసతులవంకాఁ బోయి
తెగడనేర్పితి పలుదెఱఁగుల నీవు

(॥అవి॥)
బత్తైతే నేమీఁగాదు పరు లిందరూ మెచ్చ
యెత్తైనచేఁత సేయి యితవెరిఁగి
సత్తైనగొల్లెతలతో సాములు సేసిసేసి
కొత్తరతులు నేర్పితి గుఱుతుగా నీవు

(॥అవి॥)
మరిగితే నేమీఁగాదు మావింటివారిలోనెల్లా
నిరతితో మన్నించు నేరు పెరిఁగి
పరగ శ్రీవేంకటేశ పైపై నన్నుఁ గూడితివి
యెరవులు నేర్పితివి యిన్నిచోట్లా నీవు

(||pallavi||)
avi nāmīm̐dam̐ bĕṭṭagu mappaḍi nīvu
kavagūḍa nersidivi kadalugā nīvu

(||avi||)
nagide nemim̐gādu nalugurilo nānu
taginamāḍalāḍu taramĕṟim̐gi
jagadilo nānājādisadulavaṁkām̐ boyi
tĕgaḍanerbidi paludĕṟam̐gula nīvu

(||avi||)
battaide nemīm̐gādu paru liṁdarū mĕchcha
yĕttainasem̐ta seyi yidavĕrim̐gi
sattainagŏllĕdalado sāmulu sesisesi
kŏttaradulu nerbidi guṟudugā nīvu

(||avi||)
marigide nemīm̐gādu māviṁṭivārilonĕllā
niradido manniṁchu neru pĕrim̐gi
paraga śhrīveṁkaḍeśha paibai nannum̐ gūḍidivi
yĕravulu nerbidivi yinnisoṭlā nīvu