అవసరము గాదు అండకుఁ జనకురె
(॥పల్లవి॥)
అవసరము గాదు అండకుఁ జనకురె
యివలఁ జనవరు లెంతయినాను
(॥అవ॥)
పలుకులఁ గొరఁగ పంతము విసరఁగ
చెలితోఁ జెలువుఁడు చెనకీని
వలపులు వంచఁగ వాలు ముంచఁగ
నలుగడ నాపెతో నవ్వీని
(॥అవ॥)
చిత్తము గరఁగఁగ సిగ్గులు మొరఁగఁగ
హత్తి యతఁడు సతి నలమీని
పొత్తులు గలయఁగ భోగము వెలయఁగ
వొత్తి యాపెపై నొరగీని
(॥అవ॥)
భావము చొక్కఁగ పలుకులు చక్కఁగ
దేవుఁడు దేవులఁ దెలిపీని
తావులు చల్లఁగ తతి నొల్లఁగే యాపె
శ్రీవేంకటేశుఁడు జిగిఁ గూడీని
(||pallavi||)
avasaramu gādu aṁḍagum̐ janagurĕ
yivalam̐ janavaru lĕṁtayinānu
(||ava||)
palugulam̐ gŏram̐ga paṁtamu visaram̐ga
sĕlidom̐ jĕluvum̐ḍu sĕnagīni
valabulu vaṁcham̐ga vālu muṁcham̐ga
nalugaḍa nābĕdo navvīni
(||ava||)
sittamu garam̐gam̐ga siggulu mŏram̐gam̐ga
hatti yadam̐ḍu sadi nalamīni
pŏttulu galayam̐ga bhogamu vĕlayam̐ga
vŏtti yābĕbai nŏragīni
(||ava||)
bhāvamu sŏkkam̐ga palugulu sakkam̐ga
devum̐ḍu devulam̐ dĕlibīni
tāvulu sallam̐ga tadi nŏllam̐ge yābĕ
śhrīveṁkaḍeśhum̐ḍu jigim̐ gūḍīni