Avadharimchavayya anumaana mimka nela

అవధరించవయ్య అనుమాన మిఁక నేల
Language

(॥పల్లవి॥)
అవధరించవయ్య అనుమాన మిఁక నేల
చివురుఁజేతులనె సేసవెట్టీ నదివో

(॥అవ॥)
కాంత మోవివిందు వెట్టి కన్నులనవ్వుఁజూపుల
వింతలుగ గప్పురపువిడే లిచ్చి
పొంతనె సరసముల పువ్వుబాసికేలు గట్టి
చింత దీర చెనకుల సేస వెట్టీ నిదివో

(॥అవ॥)
పక్కనఁ దనతొడలఁ బానుపు వరచి నీకు
గక్కన మోహా లనేకట్నా లిచ్చి
వెక్కసపుఁ దమకాల వియ్యము లట్టె యంది
చిక్కని చనుగుబ్బలనేస వెట్టీ నిదివో

(॥అవ॥)
దొమ్మిఁ గాఁగిటనే గురుతుల సొమ్ము లెల్ల నించి
నెమ్మది నానందముల నెలవుకొని
కొమ్మ శ్రీవెంకటేశుఁడ కూడె నిన్ను మేడలోన
చిమ్ముఁజెమటల ముత్తేలసేస వెట్టీ నిదివో

(||pallavi||)
avadhariṁchavayya anumāna mim̐ka nela
sivurum̐jedulanĕ sesavĕṭṭī nadivo

(||ava||)
kāṁta moviviṁdu vĕṭṭi kannulanavvum̐jūbula
viṁtaluga gappurabuviḍe lichchi
pŏṁtanĕ sarasamula puvvubāsigelu gaṭṭi
siṁta dīra sĕnagula sesa vĕṭṭī nidivo

(||ava||)
pakkanam̐ danadŏḍalam̐ bānubu varasi nīgu
gakkana mohā lanegaṭnā lichchi
vĕkkasabum̐ damagāla viyyamu laṭṭĕ yaṁdi
sikkani sanugubbalanesa vĕṭṭī nidivo

(||ava||)
dŏmmim̐ gām̐giḍane gurudula sŏmmu lĕlla niṁchi
nĕmmadi nānaṁdamula nĕlavugŏni
kŏmma śhrīvĕṁkaḍeśhum̐ḍa kūḍĕ ninnu meḍalona
simmum̐jĕmaḍala muttelasesa vĕṭṭī nidivo