Avadhaaru sittagimchu mamgana praaneshumdavu

అవధారు చిత్తగించు మంగన ప్రాణేశుఁడవు
Language

(॥పల్లవి॥)
అవధారు చిత్తగించు మంగన ప్రాణేశుఁడవు
యివల నీ కింతలోనే యెక్కడ పరాకు

(॥॥)
సొలపు నిట్టూర్పుల సోబానఁ బాడీఁ జెలి
పలుకులఁ గప్పురాలు పచారించీని
వలపుల చెమటల వసంతము చల్లీని
నిలువుఁ గొలువులను నెయ్యము నించీని

(॥॥)
పగటుఁ జూపుల రాయబారుల నంపీని
చిగురుఁ జేతి మొక్కుల చిమ్మి రేఁచీని
నగవుల సరసాల నారువోసీఁ దమకము
జిగిఁ బులక ముత్తేల సేసలు వెట్టీని

(॥॥)
కరగింపుఁ జెనకుల కానుకలు చేతికిచ్చి
తొరలింపు మోవుల విందులు వెట్టీని
యిరవై శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ
సిరుల నీవు గూడఁగాఁ జెలఁ గి మెచ్చీని

(||pallavi||)
avadhāru sittagiṁchu maṁgana prāṇeśhum̐ḍavu
yivala nī kiṁtalone yĕkkaḍa parāgu

(||||)
sŏlabu niṭṭūrbula sobānam̐ bāḍīm̐ jĕli
palugulam̐ gappurālu pasāriṁchīni
valabula sĕmaḍala vasaṁtamu sallīni
niluvum̐ gŏluvulanu nĕyyamu niṁchīni

(||||)
pagaḍum̐ jūbula rāyabārula naṁpīni
sigurum̐ jedi mŏkkula simmi rem̐sīni
nagavula sarasāla nāruvosīm̐ damagamu
jigim̐ bulaga muttela sesalu vĕṭṭīni

(||||)
karagiṁpum̐ jĕnagula kānugalu sedigichchi
tŏraliṁpu movula viṁdulu vĕṭṭīni
yiravai śhrī veṁkaḍeśha yīgĕ yalamelumaṁga
sirula nīvu gūḍam̐gām̐ jĕlam̐ gi mĕchchīni