Avadhaaru paraaguseyagu mabaraadhamugaa nemchagu

అవధారు పరాకుసేయకు మపరాధముగా నెంచకు
Language

(॥పల్లవి॥)
అవధారు పరాకుసేయకు మపరాధముగా నెంచకు
వివరింపఁగ నీవే గతి విష్ణుఁడ మన్నించఁ గదే

(॥అవ॥)
నాకునాకే నీసన్నిధానము గల్పించుకొని
చేకొని విన్నపములెల్లాఁ జేయుచున్నాఁడను
కాకుసేసి నన్ను వీఁ డెంత గట్టువాయ యనక
శ్రీకాంతా నీ వింతట నుందువు చిత్తగించి వినవే

(॥అవ॥)
చూచిచూచి నీమూరితి నాసొమ్ముగఁ జేసుకొని
చేచేత నాలో ధాన్యము సేయుచున్నాఁడను
కాచుకొని వీనికి నాకూఁ గారణ మేమనక
యేచోటా నీరూపమే హరి యెదలోనుండఁ గదే

(॥అవ॥)
కోరికోరి నేనూరక నీకొలువు గడించుకొని
చేరి నీవూడిగములు సేయుచున్నాఁడను
యీరీతులు శ్రీవేంకటేశ్వర యివి యేఁటిసలిగె లనక
నారాయణ సర్వేశ్వరుఁడవు నన్ను నేలఁ గదవే

(||pallavi||)
avadhāru parāguseyagu mabarādhamugā nĕṁchagu
vivariṁpam̐ga nīve gadi viṣhṇum̐ḍa manniṁcham̐ gade

(||ava||)
nāgunāge nīsannidhānamu galbiṁchugŏni
segŏni vinnabamulĕllām̐ jeyusunnām̐ḍanu
kāgusesi nannu vīm̐ ḍĕṁta gaṭṭuvāya yanaga
śhrīgāṁtā nī viṁtaḍa nuṁduvu sittagiṁchi vinave

(||ava||)
sūsisūsi nīmūridi nāsŏmmugam̐ jesugŏni
seseda nālo dhānyamu seyusunnām̐ḍanu
kāsugŏni vīnigi nāgūm̐ gāraṇa memanaga
yesoḍā nīrūbame hari yĕdalonuṁḍam̐ gade

(||ava||)
korigori nenūraga nīgŏluvu gaḍiṁchugŏni
seri nīvūḍigamulu seyusunnām̐ḍanu
yīrīdulu śhrīveṁkaḍeśhvara yivi yem̐ṭisaligĕ lanaga
nārāyaṇa sarveśhvarum̐ḍavu nannu nelam̐ gadave