Avadaaramamde nide addamaredirigaada

అవతారమందె నిదె అద్దమరేతిరికాడ
Language

(॥పల్లవి॥)
అవతారమందె నిదె అద్దమరేతిరికాడ
భవహరుఁడు శ్రావణబహుళాష్టమిని

(॥అవతార॥)
వసుదేవుఁడు సేసిన వర తపము ఫలము
పసల దేవకిపాలి భాగ్యరేఖ
దెసల సజ్జనులకు తిరమైన పుణ్యము
కొరికె కంసుని గుండెదిగులు

(॥అవతార॥)
నందగోపుని యెదుటి నమ్మిన యైశ్వర్యము
కందువ యశోదకు కనకనిధి
ముందరి గొల్లెతలకు మోహపుఁ బాలజలధి
సందడి శిశుపాలుని సంహరము

(॥అవతార॥)
దేవతలమునులకు దివ్యమైన పరంజ్యోతి
భావించుదాసుల వజ్రపంజరము
శ్రీవేంకటాద్రిమీఁదఁ జెలఁగే కృష్ణుఁడిదివో
దావతి నరకాసురు తలగుండుగండఁడు

(||pallavi||)
avadāramaṁdĕ nidĕ addamaredirigāḍa
bhavaharum̐ḍu śhrāvaṇabahuḽāṣhṭamini

(||avadāra||)
vasudevum̐ḍu sesina vara tabamu phalamu
pasala devagibāli bhāgyarekha
dĕsala sajjanulagu tiramaina puṇyamu
kŏrigĕ kaṁsuni guṁḍĕdigulu

(||avadāra||)
naṁdagobuni yĕduḍi nammina yaiśhvaryamu
kaṁduva yaśhodagu kanaganidhi
muṁdari gŏllĕdalagu mohabum̐ bālajaladhi
saṁdaḍi śhiśhubāluni saṁharamu

(||avadāra||)
devadalamunulagu divyamaina paraṁjyodi
bhāviṁchudāsula vajrabaṁjaramu
śhrīveṁkaḍādrimīm̐dam̐ jĕlam̐ge kṛṣhṇum̐ḍidivo
dāvadi naragāsuru talaguṁḍugaṁḍam̐ḍu