Auraa raajasamu amtesi tagadaa

ఔరా రాజసము అంతేసి తగదా
Language

(॥పల్లవి॥)
ఔరా రాజసము అంతేసి తగదా
గారవాన నీవాకెకుఁ గలకాలము

(॥॥)
నిలుచుండి పిలిచేటినీతో నంగన నేఁడు
మలగుపై నొరగుండే మాటలాడీని
వెలినుండి వేఁడుకోఁగా వెసఁ దలుపుమాఁటుగ
సెలవుల నవ్వీ నిన్నుఁ జెల్లురా యీసతికి

(॥॥)
ఆంగవించి సరసము లాడేటి నీతోను
ముంగిటఁ దప్పక చూచీ మోనానఁజెలి
చెంగటఁ బ్రియము చెప్పె చెక్కునొక్కఁగా నీవు
యెంగిలిమోవి గదల నించుకంత గొణఁగె

(॥॥)
పూనిపట్టి కొప్పు దువ్వి బుజ్జగించె నియ్యెడకు
మేనెల్ల మణచె నల మేలు మంగ
అని పట్టి శ్రీవేంకటాధిప కూడితి విట్టె
తానైతే నీవురమెక్కి తానకమై నిలిచె

(||pallavi||)
aurā rājasamu aṁtesi tagadā
gāravāna nīvāgĕgum̐ galagālamu

(||||)
nilusuṁḍi piliseḍinīdo naṁgana nem̐ḍu
malagubai nŏraguṁḍe māḍalāḍīni
vĕlinuṁḍi vem̐ḍugom̐gā vĕsam̐ dalubumām̐ṭuga
sĕlavula navvī ninnum̐ jĕllurā yīsadigi

(||||)
āṁgaviṁchi sarasamu lāḍeḍi nīdonu
muṁgiḍam̐ dappaga sūsī monānam̐jĕli
sĕṁgaḍam̐ briyamu sĕppĕ sĕkkunŏkkam̐gā nīvu
yĕṁgilimovi gadala niṁchugaṁta gŏṇam̐gĕ

(||||)
pūnibaṭṭi kŏppu duvvi bujjagiṁchĕ niyyĕḍagu
menĕlla maṇasĕ nala melu maṁga
ani paṭṭi śhrīveṁkaḍādhiba kūḍidi viṭṭĕ
tānaide nīvuramĕkki tānagamai nilisĕ