Auraa neevale ne namta seya neramgaa

ఔరా నీవలె నే నంత సేయ నేరఁగా
Language

(॥పల్లవి॥)
ఔరా నీవలె నే నంత సేయ నేరఁగా
పోరాటముల మంచిపొందులు సేసేవూ

(॥ఔరా॥)
యెప్పటి కప్పటిమాట యెదలోనఁ బెట్టుకొని
కప్పురాలమీఁదఁ దెచ్చి కారాలు పూసేవు
కప్పి నీకు వలసితే గాజు మాణిక మనేవు
దెప్పర మెవ్వతెనైనా దేవులఁ జేసేవు

(॥ఔరా॥)
నవ్వు టెంత నే నెంత నాలిసేసి సాదించి
పువ్వు లెల్లా వాండ్లంటాఁ బూఁచి వేసేవు
రవ్వల నీకు వలస్తే రాత్రి పగలు సేతువు
దవ్వుల నెవ్వతెకైనా దండము వెట్టుదువు

(॥ఔరా॥)
చల మేది పల మేది చనవులే మన వంటా
చలి గొనఁగాఁ గలువలు సారెఁ జల్లేవు
అలమి శ్రీవేంకటేశ అట్టే నన్నుఁ గూడితివి
నెలవై నీ కితవైతే నీవే నే నవుదువూ

(||pallavi||)
aurā nīvalĕ ne naṁta seya neram̐gā
porāḍamula maṁchibŏṁdulu sesevū

(||aurā||)
yĕppaḍi kappaḍimāḍa yĕdalonam̐ bĕṭṭugŏni
kappurālamīm̐dam̐ dĕchchi kārālu pūsevu
kappi nīgu valaside gāju māṇiga manevu
dĕppara mĕvvadĕnainā devulam̐ jesevu

(||aurā||)
navvu ṭĕṁta ne nĕṁta nālisesi sādiṁchi
puvvu lĕllā vāṁḍlaṁṭām̐ būm̐si vesevu
ravvala nīgu valaste rātri pagalu seduvu
davvula nĕvvadĕgainā daṁḍamu vĕṭṭuduvu

(||aurā||)
sala medi pala medi sanavule mana vaṁṭā
sali gŏnam̐gām̐ galuvalu sārĕm̐ jallevu
alami śhrīveṁkaḍeśha aṭṭe nannum̐ gūḍidivi
nĕlavai nī kidavaide nīve ne navuduvū