Auraa mamchi beri vavudu vannidaa neevu

ఔరా మంచి బేరి వవుదు వన్నిటా నీవు
Language

(॥పల్లవి॥)
ఔరా మంచి బేరి వవుదు వన్నిటా నీవు
సారె పయ్యదమాఁటున జట్టిశాయ వచ్చేవు

(॥ఔరా॥)
బలునాగుబ్బలనేటి బంగారుకుండలు
వెలువలు సేసేటివెరవే మారును
కొలఁదిమీరినవన్నె గోరనే వొరసి నీవు
తులఁదూఁచే నంటాను తొడికి పట్టేవు

(॥ఔరా॥)
మొల్లమిఁ గెమ్మోవియనెముద్దుగా రేపగడము
చెల్లఁబో వెలువలింకాఁ జేయవచ్చేవు
పెల్లుగా నీములువాఁడిబిత్తిరిచూపులఁ జూచి
చిల్లుల సూదివాట్లు సేయఁగ బూనేవు

(॥ఔరా॥)
నిండురంగులౌననానెరులనేనీలాలు
అండనే వెలువ సేసే వప్పటి నీవు
వెండిపైఁడిగల శ్రీవేంకటేశ నన్ను నేలి
మెండగురతులు నీమీఁద వేకొనేవు

(||pallavi||)
aurā maṁchi beri vavudu vanniḍā nīvu
sārĕ payyadamām̐ṭuna jaṭṭiśhāya vachchevu

(||aurā||)
balunāgubbalaneḍi baṁgāruguṁḍalu
vĕluvalu seseḍivĕrave mārunu
kŏlam̐dimīrinavannĕ gorane vŏrasi nīvu
tulam̐dūm̐se naṁṭānu tŏḍigi paṭṭevu

(||aurā||)
mŏllamim̐ gĕmmoviyanĕmuddugā rebagaḍamu
sĕllam̐bo vĕluvaliṁkām̐ jeyavachchevu
pĕllugā nīmuluvām̐ḍibittirisūbulam̐ jūsi
sillula sūdivāṭlu seyam̐ga būnevu

(||aurā||)
niṁḍuraṁgulaunanānĕrulanenīlālu
aṁḍane vĕluva sese vappaḍi nīvu
vĕṁḍibaim̐ḍigala śhrīveṁkaḍeśha nannu neli
mĕṁḍaguradulu nīmīm̐da vegŏnevu