(॥పల్లవి॥)
ఔరా లెస్సాయను అట్టేకాదా
కేరికేరి మమ్మునింత గేలిసేసేవు
(॥ఔరా॥)
చెలులతో నీవు సేసేచేఁత లాడుకొంటినో
చలపట్టి సారెసారె సాదించేవు
అలమి నాకొనగోర నంగము లంటితినో
చలివాసి బొమ్మలనే జంకించేవు
(॥ఔరా॥)
మేకులకు నీసతులమీఁదఁ బెట్టితినో
వాకుచ్చి వాదులకే వచ్చేవు నీవు
కై కొని నీమోవిమీఁద గంటిగాఁజేసితినో
దీకొని తప్పకచూచి దిమ్మురేఁచేవు
(॥ఔరా॥)
నీతగిలి కాఁగిటిలో తప్పులు వట్టితినో
నగుతానే నాతో నాననలు వెట్టేవు
జిగి నలమేల్మంగను శ్రీవేంకటేశుఁడ నీవు
మిగులఁ గూడితినంటా మెచ్చు మెచ్చేవు
(||pallavi||)
aurā lĕssāyanu aṭṭegādā
kerigeri mammuniṁta gelisesevu
(||aurā||)
sĕlulado nīvu sesesem̐ta lāḍugŏṁṭino
salabaṭṭi sārĕsārĕ sādiṁchevu
alami nāgŏnagora naṁgamu laṁṭidino
salivāsi bŏmmalane jaṁkiṁchevu
(||aurā||)
megulagu nīsadulamīm̐dam̐ bĕṭṭidino
vāguchchi vādulage vachchevu nīvu
kai kŏni nīmovimīm̐da gaṁṭigām̐jesidino
dīgŏni tappagasūsi dimmurem̐sevu
(||aurā||)
nīdagili kām̐giḍilo tappulu vaṭṭidino
nagudāne nādo nānanalu vĕṭṭevu
jigi nalamelmaṁganu śhrīveṁkaḍeśhum̐ḍa nīvu
migulam̐ gūḍidinaṁṭā mĕchchu mĕchchevu